ఆ జాబితాలో రకుల్‌ చేరింది

టాలీవుడ్‌ లక్కీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది.

 Rakul Preet Singh Praises Ntr-TeluguStop.com

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మధ్య ఒక సాంగ్‌ను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు.ఈ సందర్బంగా ఎన్టీఆర్‌ను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆకాశానికి ఎత్తేస్తోంది.

ఎన్టీఆర్‌ డ్యాన్సింగ్‌ గురించి, ఆయన డ్యాన్స్‌ వేగం గురించి రకుల్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

ఇప్పటి వరకు ఎన్టీఆర్‌తో కలిసి వర్క్‌ చేసిన ప్రతి ఒక్క హీరోయిన్‌ కూడా ఆయన డ్యాన్స్‌ను పొగడ్తతో ముంచెత్తిన వారే.

తాజాగా ఆ జాబితాలో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సిగ్‌ కూడా చేరింది.ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం అని, ఆయన వేగాన్ని అందుకోవడం అంత సులువు కాదు అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్‌ నటుడిగానే కాకుండా ఒక మంచి మనిషి అంటూ రకుల్‌ పేర్కొంది.ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, పలు కొత్త విషయాలను ఆయన నుండి నేర్చుకునే అవకాశం తనకు వచ్చిందని రకుల్‌ చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఒక్క సినిమాతోనే ఎన్టీఆర్‌కు రకుల్‌ ఫ్యాన్‌ అయ్యిందన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube