ప్రేమ మీద నమ్మకం అంటున్న రకుల్ ప్రీత్...  

టాలీవుడ్ టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ కూడా ఒకరుగా చేరిపోయారు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం మాల్దీవుల్లో తన కుటుంబంతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

TeluguStop.com - Rakul Preet Singh Parents 31st Wedding Anniversary In Maldives

తన కుటుంబ సభ్యులు, సోదరుడితో కలిసి సముద్ర తీరాన ఆ అందాలను వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.బికినీ ధరించిన ఫోటోలతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ ఓరేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు.

ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన కుటుంబ సభ్యులతో ఎంచక్కా టూర్ ప్లాన్ చేసి ఎంతో ఆనందంగా గడుపుతుంటారు.ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో మాల్దీవులకు ఎందుకు వెళ్లారో రకుల్ ప్రీత్ చెప్పేశారు.

TeluguStop.com - ప్రేమ మీద నమ్మకం అంటున్న రకుల్ ప్రీత్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎప్పుడు సరదాగా కుటుంబసభ్యులతో గడపడానికి ప్లాన్ చేసే రకుల్ ప్రీత్ ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా ప్లాన్ చేసి తన కుటుంబ సభ్యులతో మాల్దీవులకు వెళ్లారు.రకుల్ పేరెంట్స్ వారి 31వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసి మరి మాల్దీవులకు వెళ్లారు.

ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక వీడియోను రకుల్ ప్రీత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఈ వీడియోలో తన పేరెంట్స్ సాయంత్ర సమయంలో ఎంతో ఆనందంగా క్యాంప్ ఫైర్ పెట్టి సాల్సా డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.సముద్రతీరాన లైట్ మ్యూజిక్ లో రొమాంటిక్ స్టెప్పులు వేస్తూ రకుల్ పేరెంట్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఈ వీడియో పై స్పందించిన రకుల్ ప్రీత్ నాకు ప్రేమ పైన నమ్మకం కలగడానికి కారణం వీరిద్దరే అంటూ వారి పేరెంట్స్ డాన్స్ చేసే వీడియో పోస్ట్ చేస్తూ కామెంట్ చేశారు.మొత్తానికి తన కుటుంబ సభ్యులతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

#Viral Video #31stWedding #RakulParents #RakulPreet #Love Trust

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు