మళ్ళీ అలా కలుసుకున్న మంచు లక్ష్మి, రకుల్.. కౌగిలింతలతో?

సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి లక్ష్మీప్రసన్న కేవలం నటిగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా, నిర్మాతగా పలు కార్యక్రమాలను చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇదివరకు ఈమె ఎన్నో టాక్ షో లను నిర్వహించారు.

 Rakul Preet Singh Manchu Lakshmi Come Together As Reality Show Aha Bhojanambu-TeluguStop.com

ఈ క్రమంలోనే లక్ష్మీ మంచు సరికొత్తగా వంటలక్క అవతారమెత్తారు.ఓటీటీ వేదికగా “ఆహా” ద్వారా “ఆహా భోజనంబు” అంటూ సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇదివరకే ఆహా ద్వారా సమంత సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహించారు.అదేవిధంగా రానా దగ్గుబాటి నెంబర్‌ వన్‌ యారి వంటి షోలను చేశారు.ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇవే కాకుండా పలు సినిమాలు వెబ్ సిరీస్ లను విడుదల చేస్తూ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకుంది.

 Rakul Preet Singh Manchu Lakshmi Come Together As Reality Show Aha Bhojanambu-మళ్ళీ అలా కలుసుకున్న మంచు లక్ష్మి, రకుల్.. కౌగిలింతలతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆహా వేదికగా మంచు లక్ష్మి “ఆహా భోజనంబు” అంటూ.ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సూపర్ హిట్ అయింది.

Telugu Aha Bhojanmbu, Manchu Lakshmi, Rakul Preet Singh, Telugu Cinema-Movie

తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ మంచుతో రకుల్ ప్రీతి సందడి చేయనున్నారు.ఈ క్రమంలోనే లక్ష్మీ మంచు, రకుల్ ప్రీతిసింగ్ మధ్య ఉన్న స్నేహ భావం ఎలాంటిదో మనకు తెలిసిందే.ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా వీరిద్దరూ మరోసారి కలుసుకోవడంతో గట్టిగా ఆలింగనం చేసుకుని ఈ కార్యక్రమం మొత్తం ఎంతో సరదాగా ముచ్చటించారు.మరి ఈ కార్యక్రమం ఈ వారం ఎలా ఉండబోతుంది.? రకుల్ వంటను ఎలా తయారు చేశారు.? అనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి ఉండాలి.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Aha Bhojanmbu #Manchu Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు