ప్రభాస్ సినిమాను వదులుకున్న రకుల్, అవగాహన లేకనే ఇలా  

Rakul Preet Singh Just Missed Heroine Chance As Prabhas Mr. Perfect - Telugu Rakul Act In Telugu Tamil And Hindhi Movies, Rakul Act In Venkatadri Express, Rakul Preet Singh,

రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరి మొహం లో కూడా చిరునవ్వు కనిపిస్తుంది.ఈ ముద్దు గుమ్మ ఒక వైపు తెలుగు,తమిళ,హిందీ సినిమా తో మంచి బిజీ గా మారిన హీరోయిన్.

Rakul Preet Singh Just Missed Heroine Chance As Prabhas Mr. Perfect

అయితే తెలుగు ఇండస్ట్రీ లోకి ఈ భామ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో పరిచయం అయి ఆ తరువాత స్టార్ హీరో ల సరసన అవకాశం దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అయితే అసలు ఈ భామ తన తోలి చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కంటే ముందే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన వచ్చిన అవకాశాన్ని వదులుకుందట.

కెరీర్ ప్రారంభంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్ ఒదులుకుందట.అది కూడా సరైన అవగాహన లేకుండా ఇదంత జరింగిందంటోంది.

అప్పట్లో ఈ చిత్రంలో తాప్సీ ప్లేస్‌లో రకుల్ ‌నే తీసుకున్నారు.మూడు నాలుగు రోజులు కూడా షూటింగ్‌లో పాల్గొందట.

ఐతే.అప్పట్లో తన లక్ష్యం మిస్ ఇండియా కావడం.సినిమా రంగం తనకు సరైన రంగం కాదనుకోవడం వల్ల ఇదంతా జరిగింది అని రకుల్ తెలిపింది.నిజంగా రకుల్ గనుక అప్పుడే ఆ చిత్రానికి ఒకే చెప్పి ఉండి ఉంటే రకుల్ స్థితి ఇప్పుడు ఇంకా మంచి రేంజ్ లో ఉండేదేమో మరి.

ఇప్పుడైనా చిన్న సినిమా తో పరిచయం అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ లో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అంతా కుదిరితే.ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అయ్యాదాన్నని రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఏమైనా ఎప్పిటికైనా.ప్రభాస్‌తో కలిసి నటించడం తన కల అంటోంది ఈ భామ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test