పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్... రివీల్ చేసిన మంచు లక్ష్మి

టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీ హీరోలు పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితం స్టార్ట్ చేశారు.అలాగే సౌత్ లో మరికొంత మంది హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు.

 Rakul Preet Singh Is Getting Married Soon-TeluguStop.com

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత ఏడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్ళాడింది.పెళ్లి తర్వాత వరుస సినిమాలని కాజల్ అగర్వాల్ లైన్ లో పెట్టింది.

ప్రియమణి కూడా పెళ్లి చేసుకున్న చానళ్ళ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేస్తుంది.మరో వైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకుపోతుంది.

 Rakul Preet Singh Is Getting Married Soon-పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్… రివీల్ చేసిన మంచు లక్ష్మి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ, పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఏడాదిలో పెళ్లి పీటలు ఎక్కుతుందని తాజాగా రానా టాక్ షోలో మంచు లక్ష్మి రివీల్ చేసింది.టాలీవుడ్ లో మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలిసిందే.

నార్త్ ఇండియా నుంచి వచ్చే హీరోయిన్స్ ఎవరైనా మంచు లక్ష్మికి చేరువ అయిపోతారు. తాప్సి గతంలో మంచు లక్ష్మితో మంచి రిలేషన్ మెయింటేన్ చేసేది.

ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాగే మంచి స్నేహం కొనసాగిస్తుంది.రకుల్ వ్యక్తిగత విషయాలని కూడా లక్ష్మితో షేర్ చేసుకుంటుంది.

ఈ నేపధ్యంలోనే రకుల్ పెళ్లి వార్తలని లక్ష్మి లీక్ చేసింది.అయితే దీనిపై రకుల్ కొంత అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెళ్లి కాకపోయినా సంబంధాలు అయినా చూస్తారని, లేదంటే బాయ్ ఫ్రెండ్ అని సెట్ అవుతాడని ప్రిడిక్షన్ చెప్పింది.

ఇదిలా ఉంటే రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ తో కలిసి చేసిన కొండపొలం ఒటీటీలో రిలీజ్ కి రెడీ అవుతుంది.హిందీలో బ్యాక్ టూ బ్యాక్ 4 సినిమాలు చేస్తుంది.

ఇవి క్లిక్ అయితే బాలీవుడ్ అమ్మడు సెటిల్ అయిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

#Manchu Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు