కాబోయే వాడు ఎలా ఉండాలో చెబుతున్న రకుల్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.

ఈ అమ్మడు తన సినీ ప్రస్థానంలో పదేళ్ళు పూర్తి చేసుకుంది.ఇక నటన మీద మక్కువతో ఫాషన్ రంగంలోకి అడుగుపెట్టి తరువాత హీరోయిన్ గా కెరియర్ ఆరంభించిన ఈ అమ్మడు సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఏకంగా నాలుగేళ్లకి పైగానే పట్టింది.

తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ నటిగా మారిపోయింది.

ప్రస్తుతం అమ్మడు చేతిలో భారతీయుడు సీక్వెల్ తో పాటు రెండు హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన కెరియర్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

అలాగే తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది.ఇక ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది అనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్న నేపధ్యం ఆమె జీవిత భాగస్వామి గురించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

పెళ్లి అనేది అంద‌మైన అనుభూతిగా రకుల్ అభివ‌ర్ణించారు.కొంత మంది ఎందుక‌నో పెళ్లి అన‌గానే తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంటార‌న్నారు.

ఇలా ఎందుకో త‌న‌క‌స‌లు అర్థం కాద‌ని చెప్పింది.ఎవ‌రినైనా మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించాల‌ని చెప్పారు.

తాను అలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న అమ్మాయిన‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.నాకు కాబోయే వాడు నాకన్నా పొడవుగా ఉండాలి.

నేను హైహీల్స్‌ వేసుకున్నా నేను అతన్ని తలెత్తుకునే చూడాలి.అంత పొడవుగా ఉండాలి.

అలాగే చాలా తెలివైన వ్యక్తి అయి ఉండాలి.జీవితంలో ఏదైనా సాధించి ఉండాలి’ అని రకుల్‌ చెప్పుకొచ్చారు.

మరి అలాంటి వరుడు రకుల్ జీవిత భాగస్వామిగా దొరుకుతాడో లేక దొరికేసాడో అనేది త్వరలో తెలిసిపోతుంది.

భార్యల సీటు కోసం బస్సులొ చెప్పులతో కొట్టుకున్న భర్తలు