ప్రతిరోజు నాకు అదే కావాలి.. రకుల్ కీలక వ్యాఖ్యలు..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు 2021 సంవత్సరం కూడా కలిసిరావడం లేదు.ఈ ఏడాది రకుల్ నటించి విడుదలైన చెక్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

 Rakul Preet Singh How Those Two Days Are Changing-TeluguStop.com

వైష్ణవ్ తేజ్ తో రకుల్ నటించిన సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.అయితే తెలుగులో రకుల్ కు ఎక్కువగా ఆఫర్లు లేకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం రకుల్ కు వరుస ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడతారు.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాకపోయినా ఒక బ్లాక్ బస్టర్ హిట్ వస్తే మళ్లీ వరుస ఆఫర్లు వస్తాయని రకుల్ భావిస్తున్నారు.

 Rakul Preet Singh How Those Two Days Are Changing-ప్రతిరోజు నాకు అదే కావాలి.. రకుల్ కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రకుల్ తనకు స్విమ్మింగ్ అంటే కూడా ఎంతో ఇష్టమని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.మంగళ వారం, బుధవారం వాటర్ బేబీగా మారిపోతానని మిగిలిన రోజుల్లో కూడా స్విమ్మింగ్ చేస్తానని రకుల్ చెప్పుకొచ్చారు.

ప్రతిరోజూ తనకు స్విమ్మింగ్ కావాలంటూ రకుల్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.వేసవికాలం కావడంతో రకుల్ స్విమ్మింగ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది.

రకుల్ కొత్తగా మరే తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా బాలీవుడ్ లో మాత్రం రకుల్ చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి.ఆ మూడు సినిమాలు హిట్టైతే రకుల్ మళ్లీ ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ డీ గ్లామరస్ రోల్ లో నటిస్తున్నారు.ఈ సినిమాలోని పాత్ర తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందని రకుల్ ప్రీత్ సింగ్ భావిస్తున్నారు.క్రిష్ సినిమా తర్వాత రకుల్ వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#Goes Viral #Social Media #Water Baby #Instagram Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు