10 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్న రకుల్  

rakul preet singh Finished 10 years Career, Tollywood, Kollywood, South Cinema, Heroines, Celebrity Lifestyle - Telugu Celebrity Lifestyle, Heroines, Kollywood, Rakul Preet Singh Finished 10 Years Career, South Cinema, Tollywood

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.టాలీవుడ్ లో అతి కొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే స్టార్ హీరోయిన్ చైర్ అందుకునే అవకాశం దొరుకుతుంది.ఈ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుంది.ఏకంగా ఐదేళ్ళ పాటు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆదిపాడిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

 Rakul Preet Singh Finished 10 Years Career

ప్రస్తుతం ఆమె చేతిలో ఒక తెలుగు సినిమాతో పాటు, శంకర్ మూవీ భారతీయుడు, హిందీలో రెండు సినిమాలు ఉన్నాయి.ఈ మధ్య తెలుగులో ఆమె హవా తగ్గిన కూడా కోలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ లో స్థానం సొంతం చేసుకుంది.

అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికి పదేళ్ళు పూర్తి చేసుకుంది.ఈ విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించింది.

10 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్న రకుల్-Movie-Telugu Tollywood Photo Image

2009లో గిల్లి అనే కన్నడ సినిమాతో రకుల్ తెరంగేట్రం చేసింది.తరువాత మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని 2011లో కెరటం సినిమా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది.

రెండేళ్ళ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఆమెకి బ్రేక్ వచ్చింది.తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక తన పదేళ్ళ ప్రస్తానం గురించి ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇక్కడ ఓ ఐదేళ్లు ఉండగలిగితే చాలనుకున్నా.ఇక్కడ నాకంటూ ఎవరూ అండ లేరు.నా కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని వచ్చాను.

ఐదేళ్లు వుంటే చాలనుకున్నాను.అలాంటిది పదేళ్లవుతోంది.

భగవంతుడి దయవల్ల ఇంకా కొనసాగుతున్నాను.అందుకే ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అని తన అనుభవాలు పంచుకుంది.

#Heroines #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Finished 10 Years Career Related Telugu News,Photos/Pics,Images..