సినిమాలు ప్లాప్ అవుతున్నాయని రకుల్ ని అవమానిస్తున్నారంట...

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ, మహేష్ బాబు, రామ్ చరణ్, తదితర స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే చిన్న వయసులోనే సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం ఈ అమ్మడు బాగానే రాణిస్తోంది.

 Rakul Preet Singh Facing Negative Comments On Behind Her, Rakul Preet Singh, Rak-TeluguStop.com

అయితే అవకాశాల పరంగా ఎలాంటి కొదవ లేకపోయినప్పటికీ కానీ హిట్ల విషయంలోనే ఈ అమ్మడికి కొంతమేర వెలితి ఉంది.

కాగా ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలన్నీ దాదాపుగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపయ్యాయి.

ఇందులో ముఖ్యంగా కిక్ 2, నాన్నకు ప్రేమతో, స్పైడర్, మన్మధుడు 2, తదితర చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి.దీనికితోడు ఇటీవలే ఈ అమ్మడు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన చెక్ చిత్రం కూడా చేరింది.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కి గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతోంది.అంతే కాకుండా పలువురు స్టార్ హీరోల చిత్రాల షూటింగ్ లో పాల్గొనే టప్పుడు ఈ అమ్మడి గురించి ఐరన్ లెగ్ అంటూ వెనక చర్చించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Telugu Rakulpreet, Tollywood-Movie

మరికొందరు మాత్రం ఫ్లాప్ అవ్వాలని ఎవరూ సినిమాలు తీయరు కదా అలాగే కోట్ల రూపాయలలో రెమ్యూనరేషన్ పొందుతున్నప్పుడు ఇక హిట్, ఫ్లాప్ లతో పనేముందని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన పాత్రలన్నీ దాదాపుగా గ్లామర్ తో కూడుకున్నవే.దీంతో రకుల్ ప్రీత్ సింగ్ యంగ్ హీరోయిన్, పైగా అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పకుండా ఉండడంతో కొందరు దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని కొనసాగిస్తున్నట్లు ఇంకొందరు చర్చించుకుంటున్నారు.

ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, హిందీ, తమిళ్, తదితర భాషలలో దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.ఇక హిందీలో థ్యాంక్ గాడ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ఇక తమిళం విషయానికొస్తే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు అనివార్య కారణాల వల్ల ఆగిపోయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube