డబుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తా చూస్తారా అంటోంది?

హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గడంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సిద్దం అయ్యింది.హిందీలో యువ దర్శకుడు తెరకెక్కించబోతున్న ఒక వెబ్‌ సిరీస్‌లో రకుల్‌ నటించబోతుంది.

 Tollywood Stars, Rakul Preet Singh, Samantha, Kajal Aggarwal, Web Series, The Fa-TeluguStop.com

కథ విషయంలో చాలా ఆసక్తిగా ఉందట.కథానుసారంగా ఈ వెబ్‌ సిరీస్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించబోతుందట.

రెండు పాత్రల్లో కూడా విభిన్నమైన నటనను కనబర్చాల్సి ఉంటుందట.కవల అమ్మాయిలు అయిన ఇద్దరి మద్య జరిగే మానసిక సంఘర్షణ ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని అంటున్నారు.

రకుల్‌ మొదటి సారి ద్విపాత్రాభినయంకు సిద్దం అయ్యింది.వెబ్‌ సిరీస్‌లో ద్విపాత్రాభినయం అంటే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.కాని అది విడుదల అయిన తర్వాత ఆమె నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.హిందీలో రూపొందబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగు మరియు తమిళంలో కూడా డబ్‌ చేసే అవకాశం ఉంది.

ది ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌తో ఇప్పుడు స్టార్స్‌ అంతా కూడా వెబ్‌ సిరీస్‌ల వెంట పడుతున్నారు.

Telugu Kajal Aggarwal, Samantha, Tollywood Stars, Web-

టాలీవుడ్‌ స్టార్స్‌ సమంత కాజల్‌లతో పాటు మరికొందరు హీరోయిన్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు.వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం వల్ల ఆదాయంతో పాటు నటిగా మంచి గుర్తింపు వస్తుందని అంతా భావిస్తున్నారు.అందుకే రకుల్‌ కూడా ఈ వెబ్‌ సిరీస్‌ ను చేస్తుంది.

డబుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తాను తప్పకుండా చూడండి.సినిమా ఆఫర్లు వస్తాయని కూడా ఆమె ఆశపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube