కరోనాతో జీవితం మరో కోణంలో పరిచయం అయ్యింది… రకుల్ ఆసక్తికర వాఖ్యలు  

rakul preet singh comments on corona crisis, Tollywood, Corona Effect, Economical Crisis, 2020 - Telugu 2020, Corona Effect, Economical Crisis, Rakul Preet Singh Comments On Corona Crisis, Tollywood

కష్టాలు, సుఖాలతో సాఫీగా సాగిపోతున్న ప్రజల జీవితాలలోకి కరోనా మహమ్మారి వచ్చి అంతులేని భయాన్ని నింపేసింది.ఒక్కసారిగా పరుగులు పెడుతున్న జీవితాలు బ్రేకులు వేసినట్లు ఆగిపోయాయి.

 Rakul Preet Singh Comments On Corona Crisis

అన్ని రంగాలలో పనులు ఒక్క సారిగా ఆగిపోయాయి.ఉన్నంతలో ఈ-కామర్స్ వ్యాపారాలు, టెలికాం వ్యాపారాలు మాత్రమే లాభాల బాటలో ఉన్నాయి.

మిగిలిన అన్ని రంగాల మీద కరోనా ఊహించని ప్రభావం చూపించింది.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లు వ్యాపార సంస్థలు పొగొట్టుకున్నాయి.

కరోనాతో జీవితం మరో కోణంలో పరిచయం అయ్యింది… రకుల్ ఆసక్తికర వాఖ్యలు-Movie-Telugu Tollywood Photo Image

ఇక కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయి ఉన్న సేవింగ్స్ తో బ్రతుకులు కొనసాగించాల్సి వస్తుంది.రోజువారీ కూలి డబ్బుల మీద ఆధారపడి ప్రజలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

గత దశాబ్ద కాలంలో ఇంత ఘోరాన్ని ఎవరూ చూడలేదు.అందుకే ప్రజలకి జీవితాన్ని మరో కోణంలో పరిచయం చేసింది.

హ్యాపీగా సాగిపోయే సెలబ్రెటీలకి కూడా జీవితం అంటే ఏంటో తెలిసేలా కరోనా చేస్తుంది.ఈ విషయం తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.2020 సంవత్సరం అత్యంత విషాదకరంగా గడుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.ప్రతిరోజు భయాందోళనతో బతకాల్సి వస్తోందన్నారు.

బతికి ఉన్నందుకు భగవంతుడికి కృతజ్జతలు తెలుపుతున్నట్లు పేర్కొంది.కరోనాతో ప్రపంచం మొత్తం కష్టాల్లోకి, నష్టాల్లోకి జారిపోయిందన్నారు.

ఇలాంటి విపత్తు మునుపెన్నడూచూడలేదని, మనం భవిష్యత్తులో కూడా చూడబోం అన్నారు.ఎవరిక వారు స్వీయరక్షణతో జాగ్రత్తగా ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదని, అన్నారు.

ఇంకా అపుడే అయిపోలేదని, రాబోయేవి ఇంకా గడ్డు రోజులు అని, ఇంకా అనేక విపత్తులు, రోగాలు, యుద్ధాలు చుట్టుముడతాయని కీలక వ్యాఖ్యలు చేసింది.జీవితానికి సంబంధించి కరోనా ఎన్నో పాఠాలు నేర్పిందని మరింత జాగ్రత్తగా ఉండాలని అందరికీ సూచించింది అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మొత్తానికి కరోనా కారణంగా జీవితంలో అర్ధం కానీ ఎన్నో విషయాలు సెలబ్రెటీలకి సైతం అర్ధమైపోయాయని ఆమె మాటలతో తెలుస్తుంది.

#Corona Effect #2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Comments On Corona Crisis Related Telugu News,Photos/Pics,Images..