కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి.. రకుల్ కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.బాలీవుడ్ ఆఫర్లతో బిజీ కావడం వల్ల టాలీవుడ్ సినిమాలలో రకుల్ ఎక్కువగా నటించడం లేదు.

 Rakul Preet Singh Comments Abou Bollywood Industry And Tollywood Industry Offers-TeluguStop.com

రకుల్ కు టాలీవుడ్ ఆఫర్లు తగ్గాయని ప్రచారం జరగగా తాను ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉన్నానంటూ రకుల్ ఆ ప్రచారాన్ని ఖండించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం తాను బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్నానని రకుల్ పేర్కొన్నారు.

సౌత్ ఇండియా నుంచి కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయని అయితే కొన్ని ఆఫర్లు కావాలంటే మరికొన్ని ఆఫర్లను తప్పనిసరిగా వదులుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.హిందీలో దే దే ప్యార్ సినిమాలో నటించిన తరువాత అక్కడ తనకు ఆఫర్లు పెరిగాయని రకుల్ అన్నారు.

 Rakul Preet Singh Comments Abou Bollywood Industry And Tollywood Industry Offers-కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి.. రకుల్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా విజృంభిస్తున్న సమయంలో సైతం తనకు ఆఫర్ల విషయంలో కొదవ లేదని రకుల్ పేర్కొన్నారు.పని చేయడం తనకు ఎంతో ఇష్టమని రకుల్ చెప్పుకొచ్చారు.

హిందీలో వరుసగా ఆఫర్లు వస్తుండటం వల్లే తాను తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించడం లేదని ఆమె తెలిపారు.డ్యాన్స్ లు, పాటలు ఉన్న హిందీ సినిమాలలో తాను నటించాల్సి ఉందని రకుల్ పేర్కొన్నారు.

హిందీలో ప్రస్తుతం తాను చాలా సినిమాలు చేస్తున్నానని టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను తాను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉందని రకుల్ అన్నారు.ఒక పద్ధతి ప్రకారమే తాను డేట్లను ప్లాన్ చేసుకుంటానని రకుల్ చెప్పుకొచ్చారు.

Telugu Bollywood Industry, Movie Offers, Rakul Preet Singh, Tollywood Industry-Movie

కొండపొలం నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక సినిమాలో ఓబులమ్మ అనే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో రకుల్ నటించారు.తెలుగులో త్వరలోనే రకుల్ మునుపటిలా ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు