సమంతపై పొగడ్తలు కురిపించిన రకుల్ ప్రీత్ సింగ్

ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.మొదటి సీజన్ కంటే ప్రస్తుతం సీజన్2 లో భాగంగా వచ్చిన కంటెంట్ అద్బుతంగా ఉందనే స్పందన డిజిటల్ ఆడియన్స్ నుంచి వస్తుంది.

 Rakul Preet Singh Calls Samantha Akkineni Fire Girl, Tollywood, The Family Men 2-TeluguStop.com

ఇక సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.అలాగే సమాజంలో ఎంతో మంది క్రురత్వానికి బలై టెర్రరిస్ట్ గా మారిన అమ్మాయిగా సమంత పాత్రకి కూడా విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

మొదటి సారి పూర్తి స్థాయిలో సమంత డీగ్లామర్ పాత్రలో ఈ వెబ్ సిరీస్ లో కనిపించింది.ఇక ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత పెర్ఫార్మెన్స్ కి నాగ చైతన్య వందకి వంద మార్కులు వేసేశాడు.

Telugu Amazon Prime, Bollywood, Rajampdk, Tollywood-Movie

టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చూసి ప్రసంశలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇప్పుడు సమంతా పెర్ఫార్మెన్స్ ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేసింది.ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ మా ఫ్యామిలీతో కలిసి చూశానని ఇందులో మనోజ్ బాజ్ పాయ్ పాత్ర, అతని నటన అద్బుతంగా ఉందని రకుల్ పేర్కొంది.ఇక సమంత అయితే నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ తో టెక్ ఏ బౌ అనే విధంగా ఆధారగొట్టిందని పొగడ్తలు కురిపించింది.

ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం దర్శకులు రాజ్ అండ్ డీకేకి పెద్ద ఫాన్స్ గా మారిపోయామని పేర్కొంది.మొత్తానికి ఒక స్టార్ హీరోయిన్ గురించి మరో స్టార్ హీరోయిన్ ఈ రేంజ్ లో పొగిడింది అంటే సమంతా ది ఫ్యామిలీ మెన్ 2లో ఏ స్థాయిలో నటించిందో చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube