రకుల్ ప్రీత్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

రకుల్ ప్రీత్ సింగ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Actress Rakul Preet Singh Assets Details,rakul Preet Singh, Rakul Assets Cost,-TeluguStop.com

ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.వేంకటాద్రి ఎక్సప్రెస్ లో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈమె మొదట అమాయకంగా కనిపించి.

బోయపాటి సినిమాల్లో ఏడుస్తూ ఏమోషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల అందరి సరసన నటించింది.అక్కినేని నాగార్జునతో కలిసి మన్మథుడు సినిమాలో నటించిన రకుల్ ఆతర్వాత కనిపించలేదు.
ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు అంత ఎక్కువ అవకాశాలు కూడా ఎం రావడం లేదు.కన్నడ సినిమా గిల్లితో వచ్చిన ఈ హిందీలోను ఓ సినిమాలో నటించింది.

అయితే ఆ వెంటనే తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన ట్యాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు చూపించి బాగా దగ్గరయింది.టాలీవుడ్ అందరి హీరోయిన్లలా రకుల్ ప్రీత్ లేదు.

మొదటే అందాల ఆరబోత చెయ్యడంతో ప్రస్తుతం ఆమెకు స్టార్ హీరోయిన్ అని పేరు ఉన్నప్పటికీ ఆ రేంజ్ అవకాశాలు రావడం లేదు.

Telugu Actressrakul, Gym-Movie

అలాంటి ఈ రకుల్ ప్రీత్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలో ఎంత సంపాదించిందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.ఎంత సంపాదించింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బిజినెస్ చేస్తూ భారీ స్థాయిలో సంపాదించింది.

ఎంత సంపాదించింది అనేది డబ్బు రూపంలో చెప్పలేం కానీ.ఆమెకు ఉన్న స్థిరాస్తుల వివరాలు మాత్రం చెప్పగలం.

రకుల్ ప్రీత్ కు హైదరాబాద్‌తో పాటు ముంబై, వైజాగ్ నగరాల్లో కూడా స్థిరాస్తులు ఉన్నాయి.

Telugu Actressrakul, Gym-Movie

ఇంకా హైదరాబాద్ లో కూడా ఆమెకు ఒక సొంత ఇల్లు ఉంది.ఆ ఇంటి కోసం రకుల్ ప్రీత్ ఏకంగా మూడు కోట్లకుపైగా ఖర్చు చేసింది.షూటింగ్స్ కోసం రకుల్ ప్రీత్ హైదరాబాద్ కి వస్తే రకుల్ తన సొంత ఇంటిలోనే ఉంటుందట.

అంతేకాదు రకుల్ కి హైదరాబాద్ లో రెండు జిమ్ బ్రాంచ్ లు, వైజాగ్ లో ఒకటి ఉంది.ఇవి మాత్రమే కాకుండా కోట్లలో విలువ చేసే డైమెండ్ రింగ్ కూడా ఆమె వద్ద ఉందని ప్రచారం.

ఇది అంత కూడా గత పదేళ్లలో సంపాదించిందని నెట్టింట్లో కొందరు చర్చిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube