బాబోయ్‌.. వర్షంలో తడిసినందుకు కోటి తీసుకుందట!  

Rakul Preet Remuneration 1cr For Ntr Biopic-

ఎన్టీఆర్‌ బయోపిక్‌పై రోజు రోజుకు అంచనాలు, ఆసక్తి పెరుగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే బయటకు వచ్చిన స్టిల్స్‌ మరియు ఇతరత్ర విషయాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది..

బాబోయ్‌.. వర్షంలో తడిసినందుకు కోటి తీసుకుందట!-Rakul Preet Remuneration 1Cr For NTR Biopic

ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోషిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాల్గొన్న విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఆకుచాటు పిందె తడిసే. పాటకు డాన్స్‌ చేస్తూ కుమ్మేశారు. ఇద్దరు కూడా నిజంగా ఎన్టీఆర్‌, శ్రీదేవిలను దించేశారు అన్నట్లుగా ఒక స్టిల్‌ను విడుదల చేశారు. ఆ స్టిల్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో సినిమాకు రకుల్‌ హైలైట్‌గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

కేవలం ఆకుచాటు పిందె తడిసే. పాటలో మాత్రమే కాకుండా ఇంకా పలు సీన్స్‌లో కూడా రకుల్‌ ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది..

ఇక ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో రకుల్‌ నటిస్తున్నందుకు ఏకంగా కోటి పారితోషికం తీసుకుంటుందనే టాక్‌ వినిపిస్తుంది. రకుల్‌ పాత్ర సినిమాలో కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే కనిపించబోతుంది. అయినా కూడా ఆమెకు ఏకంగా కోటి రూపాయల పారితోషికం అంటూ ప్రచారం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. రకుల్‌ పారితోషికం విషయంలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం రకుల్‌కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో అంత పారితోషికం ఇవ్వడం అనుమానమే అంటున్నారు. సంవత్సరం క్రితం రకుల్‌ భారీగా క్రేజ్‌ను కలిగి ఉంది. కాని ఇప్పుడు అంత లేదనే విషయం అందరికి తెల్సిందే. మరి ఎన్టీఆర్‌ ఆమెకు ఎంత ఇచ్చాడో చిత్ర నిర్మాతకే తెలియాలి.