సీక్రెట్స్ బయట పెడుతూ మంచు లక్ష్మి పరువు తీస్తున్న సెలబ్రేటీలు!

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.

 Rakul Preet Brother Aman Preet About Manchu Lakshmi-TeluguStop.com

మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన మంచు లక్ష్మి పలు సినిమాలలో నటించింది.కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది.

ఇక నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది మంచు లక్ష్మి.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

 Rakul Preet Brother Aman Preet About Manchu Lakshmi-సీక్రెట్స్ బయట పెడుతూ మంచు లక్ష్మి పరువు తీస్తున్న సెలబ్రేటీలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మీ పరువును తీశారు సెలబ్రెటీలు.

తొలిసారిగా ఇంగ్లీష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి.

అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక సినిమాలకు దూరంగా ఉంటూ పలు కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటుంది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఆహా లో ఆహా భోజనంబు అంటూ వంటల ప్రోగ్రాం ను ప్రారంభించింది మంచు లక్ష్మి.ఇక ఇందులో హోస్టింగ్ చేస్తూ వచ్చిన గెస్టు లతో వంటలు చేయిస్తుంది.ఇక ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ పూర్తవగ అందులో విశ్వక్ సేన్ పాల్గొని కొన్ని రకాల వంటలను చూపించాడు.

ఇక తాజాగా రెండో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గెస్ట్ గా పాల్గొన్నది.నిజానికి మంచు లక్ష్మి, రకుల్ మంచి స్నేహితులని పైగా మంచు లక్ష్మి షో లలో స్పెషల్ గెస్ట్ గా రకుల్ ప్రీత్ ఉంటుందని అందరికీ తెలిసిందే.ఇక ఈ షోలో రకుల్ పాల్గొనగా తన సోదరుడు అమన్ ప్రీత్ కొన్ని వస్తువులు పంపాడు.

రకుల్ ఓ డిష్ చేసినట్లు కనిపించగా.తన సోదరుడితో మంచు లక్ష్మి వీడియో కాల్ ద్వారా కొన్ని సీక్రెట్స్ బయటికి రావడానికి ప్రశ్నలు వేసింది.

నీ పట్ల రకుల్ ఎక్కువ జాగ్రత్తలు చెబుతుంటుంది.ప్రొటెక్టివ్ గా ఉంటుంది కదా? అందుకు నీకేమనిపిస్తుంది అని ప్రశ్నించింది మంచు లక్ష్మి.వెంటనే ఆమె కంటే నువ్వే ఎక్కువ చేస్తావ్.నువ్వే ఎక్కువ ప్రొటెక్టివ్ అంటూ మంచులక్ష్మి పరువు తీయగా వెంటనే రకుల్ తెగ నవ్వుకుంది.

#Lakshmi Manchu #Vishwak Sen #Manchu Lakshmi #Aman Preet #AhaBhojanambu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు