విజయ్ దేవరకొండతో దేనికైనా రెడీ అంటున్న రకుల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ సినిమాలు చక్కబెట్టేసి బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టింది.అక్కడ ఏకంగా ఒకేసారి మూడు సినిమాలు కమిట్ అయ్యింది.

 Rakul Open Offer To Romance With Vijay Devarakonda-TeluguStop.com

అయితే ఇవి షూటింగ్ దశలో ఉండగానే ఇప్పుడు కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడ్డాయి.ఇదిలా ఉంటే ఈ భామ టాలీవుడ్ హీరోలపై మరో సారి తన ప్రేమ ని చాటుకుంటుంది.

ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ మీద మోజు పడుతుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మీద హాట్ కామెంట్స్ చేసింది.

విజయ్ దేవరకొండని చూస్తే నటించడానికే పుట్టాడని అనిపిస్తుందని ఈ భామ చెప్పుకొచ్చింది.

కెరీర్‌లో ఒక్కసారైనా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని చెబుతుంది.

ఆయన నటిస్తుంటే అలా చూడాలనిపిస్తుందని అంటుంది.కచ్చితంగా తమ జోడీ స్క్రీన్‌పై కలిస్తే హాట్ పుట్టిస్తుందని అభిప్రాయపడింది.

దర్శక నిర్మాతలు ఎవరైనా కూడా తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంటే మాత్రం నేను వెంటనే ఒకే చెప్పేస్తానని ఆఫర్ కూడా ఇచ్చేసింది.విజయ్ దేవరకొండ నటించి తన ముచ్చట తీర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది.

మొత్తానికి ఇంత మంది స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన రాని కిక్ తనకి విజయ్ తో చేస్తే వస్తుందని రకుల్ ఇంత ఓపెన్ గా చెబుతూ ఉంటే వీరిని సెట్స్ పైకి తీసుకెళ్ళే దర్శకులు ఎవరు ముందుకి వస్తారు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube