సౌత్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఈమధ్య కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపించినా మళ్లీ ఇక్కడ తిరిగి ఫాం లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన కొండపొలం సినిమాలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్.
సినిమాలో ఓబులమ్మ పాత్రలో రకుల్ డీ గ్లామరస్ రోల్ లో నటించింది.అయితే ఈ సినిమాలో తన రోల్ అలాంటిది.
సినిమాతో ఖచ్చితంగా మరోసారి తన సత్తా చాటుతానని అంటుంది రకుల్.
సినిమాలో గ్లామర్ షో చేయని రకుల్ కొండపొలం ప్రమోషన్స్ లో మాత్రం గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది.
ఈమధ్య కొండపొలం ఆడియో ఈవెంట్ లో కూడా అమ్మడి అందాలకు అందరు ఫిదా అయ్యారు.ఇక కొండపొలం ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా రకుల్ గ్లామర్ షో చేస్తుంది.
సినిమాలో చేసిన ఓబులమ్మ పాత్రకి.రకుల్ ప్రమోషన్స్ లో చేస్తున్న గ్లామర్ షోకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు.
అమ్మడు కావాలనే మీడియా అటెన్షన్ కోసం ఇలా రెచ్చిపోతుందని కొందరు అంటున్నారు.ఏది ఏమైనా రకుల్ గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.