బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన రకుల్… ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో  

Rakul Crazy Offer Bollywood Sequel - Telugu De De Pyar De Movie, Indian Cinema, Rakul Got A Chance Super Hit Movie Sequel In Bollywood, Tollywood

కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఐదేళ్ళ కాలంలో తెలుగులో స్టార్ హీరోలందరితో జత కట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఈమె కెరియర్ ఎంత వేగంగా పుంజుకుందో అంతే వేగంగా క్రింద పడిపోయింది.

 Rakul Crazy Offer Bollywood Sequel

ప్రస్తుతం తెలుగులో తాజాగా హీరో నితిన్ తో నటించే అవకాశం అందుకుంది.ఈమె చేతిలో తెలుగులో ఒకే ఒక్క సినిమా ఉంది.

అయితే టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ పై దృష్టిపెట్టిన రకుల్ కి అక్కడ అదృష్టం భాగానే కలిసి వస్తుంది.

బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన రకుల్… ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో-Movie-Telugu Tollywood Photo Image

అజయ్ దేవ్‌గన్‌తో దేదే ప్యార్ దే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మరో మూడు సినిమా అవకాశాలు అందుకుంది.దీంతో రకుల్ ముంబైకి మకాం మార్చేసింది.ఈచిత్రానికి సీక్వెల్‌ ని తెరకెక్కించే ప్రయత్నంలో ఇప్పుడు దేదే ప్యార్ దే దర్శక, నిర్మాతలు ఉన్నారు.ఇక ఈ సీక్వెల్ కోసం మళ్ళీ అజయ్ దేవగన్ కి జోడీగా రకుల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రకుల్ అజయ్‌తో థ్యాంక్యూ గాడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది.ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మూడో సినిమా అజయ్ దేవగన్ తో నటించే ఛాన్స్ ఈ అమ్మడు సొంతం చేసుకోవడం విశేషం.

ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలీవుడ్ రకుల్ కొంత వరకు సక్సెస్ బాట పట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Got A Chance Super Hit Movie Sequel In Bollywood Related Telugu News,Photos/Pics,Images..