స్టార్ హీరోయిన్ తో ఉపాసన వంటకాలు..?

మెగా ఫ్యామిలీ సినీ పరిశ్రమలో కాకుండా బయట విషయాలలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన సంగతే.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటారు.

 Rakul Cooks With Upasana-TeluguStop.com

తమకు సంబంధించిన విషయాలను, ఏదైనా వేడుకలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉంటే మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా బయట విషయాలలో యాక్టివ్ గా ఉండటంతోపాటు.

ఈ మధ్య వంటకాలను పరిచయం చేస్తుంది.

 Rakul Cooks With Upasana-స్టార్ హీరోయిన్ తో ఉపాసన వంటకాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొణిదెల ఉపాసన ఇటీవలే సోషల్ మీడియాలో యువర్ లైఫ్ డాట్ అనే పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇక ఇందులో లైఫ్ స్టైల్, హెల్త్ విషయాల పట్ల ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తుంటుంది.అంతేకాకుండా ఉపాసన అపోలో సేవల గురించి అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే.ఇక సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పుడు లైఫ్ స్టైల్ సంబంధించిన విషయాలను, యోగాసనాలను చూపిస్తూ ఉంటుంది.ఇక తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తో వంటకాన్ని పరిచయం చేయించింది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు.

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం రకుల్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.ఖాళీ సమయాల్లో కొన్ని లైఫ్ స్టైల్ విషయంలో పాల్గొంటుంది.

తన శరీర ఫిట్నెస్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంటుంది.ఇక తాజాగా ఉపాసనతో కలిసి వంటల కార్యక్రమంలో పాల్గొన్నది.

అందులో ఓ స్పెషల్ వంటకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రకుల్.తను చేసిన వంటకం పంజాబీ డిష్ అని, రోటి పాలక్ తరహాలో పచ్చని ఆకుకూరలతో ఈ వంటకాన్ని ప్రిపేర్ చేసింది.

Telugu Cooks, Rakul Preetsingh, Tollywood, Upasana-Movie

ఇక ఉగాది సందర్భంగా ఈ వంటకాన్ని పరిచయం చేశారట.ఇక ఈ వంటకం ను ఎలా తయారు చేసుకోవాలో కూడా తన వెబ్ సైట్ లో.వీడియో అప్లోడ్ కూడా చేశామని తెలిపారు.ఇదిలా ఉంటే ఉపాసన మరో టాలీవుడ్ బ్యూటీ సమంతతో కలిసి ఆరోగ్యకరమైన వంటకాలు చేసిన సంగతి తెలిసిందే.

#Cooks #Upasana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు