హీరోలకంటే హీరోయిన్స్ ఇందులో తక్కువ అంటున్న రకుల్  

Rakul Comments On Hero Heroine Remuneration Difference In South Cinema - Telugu Bollywood, Hero, Heroine Remuneration Difference, Rakul Comments, South Cinema, Tollywood

కెరటం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సక్సెస్ అందుకొని తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అయితే ఈ మధ్య ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.

Rakul Comments On Hero Heroine Remuneration Difference In South Cinema

నార్త్ నుంచి టాలీవుడ్ లోకి దిగుమతి అయ్యే హీరోయిన్స్ ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారో అంతే వేగంగా అవకాశాలు కోల్పోయి మరల ఖాళీ అయిపోతారు.పెద్దగా స్కోప్ లేని పాత్రలతో కేవలం హీరోలతో డ్యూయెట్స్ కోసమే అన్నట్లు చాలా మంది హీరోయిన్స్ ఉంటారు.

వాళ్ళు స్టార్ హీరోలతో ఆడిపాడిన రెమ్యునరేషన్ తప్ప పెద్దగా వచ్చే గుర్తింపు ఉండదు.

ఈ నేపధ్యంలో నార్త్ భామలు తెలుగులో తమ ఇమేజ్ పెంచుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఒక ఫ్లాట్ ఫాంగా వాడుకొని తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు.

అలా వెళ్ళిన వారిలో తక్కువ మంది మాత్రమే అక్కడ సక్సెస్ అయ్యారు.ఇప్పుడు అదే దారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రయాణం చేస్తుంది.మన్మధుడు తర్వాత తెలుగు సినిమాని పక్కన పెట్టె బాలీవుడ్ లో తన అదృష్టం టెస్ట్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే సౌత్ లో స్టార్ ఇమేజ్ పొంది బాలీవుడ్ కి వెళ్ళిన అందరి భామల తరహాలోనే రకుల్ కూడా సౌత్ హీరోల మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.

సౌత్ ఇండియా సినిమాలలో హీరోలు,హీరోయిన్స్ ఒకే విధంగా కష్టపడ్డ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం చాలా అంతరం ఉంటుందని చెప్పింది.హీరోలకి ఇచ్చే ప్రాధాన్యత హీరోయిన్స్ కి ఉండదని చెప్పింది.

అలాగే ఆడవారికి సమాన హక్కులు అని ఎంత చెబుతున్న ఈ అంతరం మాత్రం ఇప్పటికి ఉందని, అది సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువగా ఉందని అమ్మడు చెప్పడం విశేషం.అయితే రకుల్ సినిమా ఇండస్ట్రీని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పిందా లేక సౌత్ సినిమాలలో తనకి ఎదురైనా అనుభవాలతో చెప్పిందా అనేది మాత్రం క్లారిటీ లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు