హీరోలు తాగొచ్చు కాని హీరోయిన్స్‌ తాగవద్దా అంటున్న స్టార్‌ హీరోయిన్‌

మన్మధుడు 2 చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరగుతుంది.చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అధికారికంగా కాకున్నా అనధికారికంగా రకుల్‌ పాత్రను బోల్డ్‌గానే చూపించే ప్రయత్నం చేశారు.

 Rakul About Her Character In Manmadhudu 2-TeluguStop.com

బోల్డ్‌ పాల్రో రకుల్‌ కనిపించబోతుందని ప్రేక్షకులకు హింట్స్‌ ఇస్తూ వచ్చారు.అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాత్రం తాజాగా మన్మధుడు 2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వ్యక్తం చేసింది.

హీరోలు తాగొచ్చు కాని హీరోయిన�

ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా మన్మధుడు 2 చిత్రంలో నాదేం బోల్డ్‌ పాత్ర కానే కాదు.కాస్త ఫ్రీడం ఎక్కువ ఉన్న అమ్మాయిగానే నేను కనిపిస్తాను.నేను ఈ చిత్రంలో సిగరెట్‌ తాగడం వల్ల బోల్డ్‌ పాత్ర అంటున్నారు.హీరోలు సిగరెట్స్‌ తాగితే మాస్‌ అంటారు అదే హీరోయిన్స్‌ తాగితే మాత్రం ఎందుకు ఒప్పుకోరు.

మాది ఎందుకు బోల్డ్‌ అవుతుంది అంటూ రకుల్‌ ఎదురు ప్రశ్నించింది.రకుల్‌ ఇంకా తన పాత్ర గురించి సినిమాలో మాట్లాడుతూ అందరికి నచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

హీరోలు తాగొచ్చు కాని హీరోయిన�

ప్రస్తుతం రకుల్‌ పరిస్థితి ఆసించిన స్థాయిలో లేదు.తెలుగులో ఈమె చేసిన వరుస చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.గత రెండేళ్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు సరైన సక్సెస్‌ కావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.హిందీలో దేదే ప్యార్‌ దే చిత్రంతో మంచి విజయాన్ని అయితే దక్కించుకుంది.

కాని అక్కడ మాత్రం ఆఫర్లు పెద్దగా రావడం లేదు.అందుకే మన్మధుడు 2 హిట్‌ అయితే రకుల్‌ కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

మరి ఈ చిత్రం రకుల్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube