తనూశ్రీ డ్రగ్స్‌ తీసుకుని తనను రేప్‌ చేసిందంటున్న రాఖీ సావంత్‌  

Rakisavanth Sensational Comments On Tanu Sri Dutta-

ఇండియాలో మీటూ ఉద్యమం ఈ రేంజ్‌లో పెరిగి పోవడానికి ప్రధాన కారణం తనూశ్రీ దత్తా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటి నుండో మీటూ ఉద్యమం ఉంది. కాని ఇండియాలో మాత్రం మీటూ ఉద్యమం పెద్దగా లేదు..

తనూశ్రీ డ్రగ్స్‌ తీసుకుని తనను రేప్‌ చేసిందంటున్న రాఖీ సావంత్‌-Rakisavanth Sensational Comments On Tanu Sri Dutta

అలాంటి సమయంలో నానా పటేకర్‌ పై తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం మొదలైంది. తనూశ్రీ దత్తా దారిలోనే మీటూ అంటూ ఎంతో మంది స్టార్స్‌ మరియు సాదారణ మహిళలు తమపై జరిగిన లైంగిక దాడులను చెప్పుకుంటున్నారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం పెద్ద అంశంగా మారిపోయింది.

ఇలాంటి సమయంలో తనూశ్రీ దత్తాపై రాకీ సావంత్‌ రివర్స్‌ ఎటాక్‌ చేస్తోంది.

తనూశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలపై ఇప్పటికే నానా పటేకర్‌ కోర్టుకు వెళ్లాడు. మరో వైపు నానాకు మద్దతుగా రాఖీ సావంత్‌ వరుసగా తనూశ్రీ దత్తాపై విమర్శలు చేస్తోంది. తనూశ్రీ దత్తా డ్రగ్స్‌ తీసుకుంటుందని, ఒకసారి ఆమె డ్రగ్స్‌ తీసుకుని వ్యాన్‌ లో పడుకుండి పోతే నేను ఆమె స్థానంలో పాటలో నటించాను అంటూ పేర్కొంది.

డ్రగ్స్‌ తీసుకున్న తనూశ్రీ దత్తా మగరాయుడిలా ప్రవర్తించేదని, కొన్ని సార్లు ఆమె ప్రవర్తన అసభ్యంగా, అసహ్యంగా అనిపించేదని రాఖీ సావంత్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. .

కొన్ని సంవత్సరాల క్రితం నేను, తనూశ్రీ మంచి స్నేహితులం. ఆ సమయంలో ఆమె నా మర్మాంగాలపై చేయి వేయడంతో పాటు, నన్ను ఊరికే ముద్దు పెట్టుకోవడం, మగరాయుడి మాదిరిగా ప్రవర్తించడం చేసేదని రాఖీసావంత్‌ చెప్పుకొచ్చింది. ఆమె నన్ను పలు సార్లు రేప్‌ కూడా చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

రాఖీ సావంత్‌ తనపై చేస్తున్న ఆరోపణలు తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ ఇప్పటికే తనూశ్రీ దత్తా 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.