రాఖీ సావంత్ చేసిన ప‌నిచూస్తే సిగ్గుతో తలదించుకుంటారు.. రేప్ జరుగకుండా అక్కడ తాళం వేసుకొని విడియో.!     2018-10-28   10:07:20  IST  Sai Mallula

ఇండియాలో మీటూ ఉద్యమం ఈ రేంజ్‌లో పెరిగి పోవడానికి ప్రధాన కారణం తనూశ్రీ దత్తా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటి నుండో మీటూ ఉద్యమం ఉంది. కాని ఇండియాలో మాత్రం మీటూ ఉద్యమం పెద్దగా లేదు. అలాంటి సమయంలో నానా పటేకర్‌ పై తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం మొదలైంది. తనూశ్రీ దత్తా దారిలోనే మీటూ అంటూ ఎంతో మంది స్టార్స్‌ మరియు సాదారణ మహిళలు తమపై జరిగిన లైంగిక దాడులను చెప్పుకుంటున్నారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం పెద్ద అంశంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో తనూశ్రీ దత్తాపై రాకీ సావంత్‌ రివర్స్‌ ఎటాక్‌ చేస్తోంది.తనూశ్రీ దత్తా డ్రగ్స్‌ తీసుకుంటుందని, ఒకసారి ఆమె డ్రగ్స్‌ తీసుకుని వ్యాన్‌ లో పడుకుండి పోతే నేను ఆమె స్థానంలో పాటలో నటించాను అంటూ పేర్కొంది. డ్రగ్స్‌ తీసుకున్న తనూశ్రీ దత్తా మగరాయుడిలా ప్రవర్తించేదని, కొన్ని సార్లు ఆమె ప్రవర్తన అసభ్యంగా, అసహ్యంగా అనిపించేదని రాఖీ సావంత్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.

watch video:

ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ ఇలాంటి సంఘటనల నుంచి అమ్మాయిలు తమకు తాము ఎలా రక్షణ కల్పించుకోవాలో చెబుతూ షాకింగ్ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె తన లో దుస్తులకు తాళం వేసుకుని కనిపించింది.

Rakhi Sawant Use Godrej Lock Stunt For Women Safety-

Rakhi Sawant Use Godrej Lock Stunt For Women Safety

నేను మీ రాఖీ సావంత్… ఈ దేశంలోని అమ్మాయిలు, మహిళలు అత్యాచారాలకు గురి కాకుండా ఉండేందుకు సైంటిస్టుగా మారాను. మీ కోసం పరిష్కారం కనుకొన్నాను అంటూ ఆమె తన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో లోదుస్తులు ధరించే ప్రాంతంలో రాఖీ సావంత్ నడుము చుట్టూ గొలుసుతో చుట్టుకుని తాళం వేసకుని కనిపించింది. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఎవరూ రేప్ చేయలేరు, మీరు ఎక్కడికి వెళ్లిన సేఫ్‌గా ఉంటారంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతే కాకుండా నడుముకు తాళం వేసుకుని అసభ్యంగా డాన్స్ చేస్తూ మరో వీడియో పోస్టు చేసింది. రాఖీ సావంత్ పోస్టు చేసిన ఈ వీడియో చూసి కొందరు ఫన్నీగా ఉందంటూ నవ్వుకుంటుండగా, మరికొందరు రాఖీ మహిళల విషయంలో మరింత నీచానికి దిగజారింది అంటూ విమర్శిస్తున్నారు.