ఆ సినిమా వల్ల చనిపోవాలనుకున్న డైరెక్టర్.. అసలేమైందంటే?

సినిమా రంగంలో జయాపజయాలు సాధారణమనే సంగతి తెలిసిందే.కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను అందుకుంటాయనే సినిమలు ఫ్లాప్ అయితే మరికొన్ని సార్లు ఏ మాత్రం అంచనాలు లేని సినిమాలు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి.

 Director Rakeysh Omprakash Sensational Comments On Delhi 6 Failure, Delhi 6 Fail-TeluguStop.com

సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా మొదట హీరోపై ఆ తర్వాత దర్శకునిపై రిజల్ట్ ప్రభావం ఉంటుంది.హిట్ వస్తే దర్శకులకు ఏ స్థాయిలో ప్రశంసలు వస్తాయో సినిమా ఫ్లాప్ అయితే అదే స్థాయిలో విమర్శలు వస్తాయి.

ప్రముఖ దర్శకులలో ఒకరైన ఓంప్రకాశ్ మెహ్రా కూడా జీవితంలో ఇలాంటి స్థితిలో ఉండటంతో పాటు ఆ స్థితిని దాటి వచ్చిన వారే కావడం గమనార్హం.2009 సంవత్సరంలో ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్ లో తెరకెక్కిన ఢిల్లీ6 సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఓం ప్రకాశ్ మెహ్రా డిప్రెషన్ లోకి వెళ్లారు.

Telugu Delhi Failure, Failure, Om Prakash, Rakeysh, Rang De Basati, Sensational,

కొంతమంది ప్రేక్షకులు సినిమా పూర్తిగా చూడకుండానే బయటకు వెళ్లిపోవడం ఈ దర్శకుడిని మరింత బాధించింది.ఈ సినిమా చూసిన కొంతమంది ఫ్యాన్స్ అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ లతో చెత్త సినిమా తీసినందుకు చీకటి ప్రదేశానికి వెళ్లి తల దాచుకున్నానని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత మద్యానికి బానిసై పీకల దాకా తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నానని ఓం ప్రకాష్ మెహ్రా అన్నారు.

Telugu Delhi Failure, Failure, Om Prakash, Rakeysh, Rang De Basati, Sensational,

తన ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు ఎంతగానో బాధ పడ్డారని ఓం ప్రకాష్ మెహ్రా చెప్పుకొచ్చారు.తాను ఎవరినైతే ప్రేమిస్తానో వారికే తాను దూరమయ్యానని ఓం ప్రకాష్ మెహ్రా అన్నారు.తుఫాన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఓం ప్రకాష్ భాగ్ మిల్కా భాగ్ రంగ్ దే బసంతి సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube