జబర్దస్త్ కు తాగేసి వెళ్లాను.. రాకేష్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

జబర్దస్త్ షో ద్వారా ప్రతిభ ఉన్న ఎంతోమంది కమెడియన్లు గుర్తింపును సంపాదించుకుని సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ షోపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా కమెడియన్లు మాత్రం తమకు భారీస్థాయిలో గుర్తింపు రావడానికి జబర్దస్త్ షోనే కారణమని చెబుతారు.

 Rakesh Master Shocking Comments About Jabardasth Show-TeluguStop.com

ప్రముఖ కొరియోగ్రాఫర్ లలో ఒకరైన రాకేష్ మాస్టర్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో స్కిట్లు చేస్తున్నారు.

రాకేష్ మాస్టర్ పాల్గొన్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా ప్రోమోకు రాకేష్ మాస్టర్ హైలెట్ అయ్యారు.

 Rakesh Master Shocking Comments About Jabardasth Show-జబర్దస్త్ కు తాగేసి వెళ్లాను.. రాకేష్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కు రాకేష్ మాస్టర్ తాగేసి వెళ్లారని ప్రచారం జరిగింది.ఈ ప్రచారం గురించి రాకేష్ మాస్టర్ స్పందించి స్పష్టతనిచ్చారు. బుల్లెట్ భాస్కర్ తనను జబర్దస్త్ షోకు పిలిచారని అయితే జబర్దస్త్ షో స్కిట్ చేసిన సమయంలో తాను తాగేసి ఉన్నానని రాకేష్ మాస్టర్ తెలిపారు.

Telugu Comments Viral, Drinking Habits, Jabardasth Show, Rakesh Master-Movie

తాగి ఉన్నానని తాను జబర్దస్త్ స్కిట్ లోకి రానని చెప్పానని ఆ విషయం ఆ షోలో ఉన్నవాళ్లందరికీ తెలుసని అన్నారు.బుల్లెట్ భాస్కర్ తనకు ఆర్థికపరమైన సహాయం చేశాడని రాకేష్ మాస్టర్ తెలిపారు.తనకు ఒక సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చిందని జబర్దస్త్ షో తరువాత తనకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయని రాకేష్ మాస్టర్ అన్నారు.

తాను బుల్లెట్ భాస్కర్ ను 3,000 రూపాయలు అడిగితే వెంటనే గూగుల్ పే చేశారని తెలిపారు.

యాడ్స్ కు కూడా తనను అడుగుతున్నారని తన తల్లి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడుతున్నారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

రామ్ ప్రసాద్ తనతో మహత్తరమైన టాలెంట్ ఉందని ప్రశంసించారని రాకేష్ మాస్టర్ అన్నారు.జబర్దస్త్ షో ద్వారా రాకేష్ మాస్టర్ వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#Rakesh Master #Drinking Habits #Comments Viral #Jabardasth Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు