చిరంజీవి, రజినీకాంత్ లు రోడ్డు మీద తిరిగేవాళ్ళు.. రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్?

దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసి, మరెంతో మంది భవిష్యత్తుకు పునాదులు వేసిన డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో రాకేష్ మాస్టర్ ఎక్కువగా హలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల ద్వారా స్టార్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాము.

 Rakesh Master Sensational Comments On Chiranjeevi Rajinikanth-TeluguStop.com

ఎన్నో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన రాకేష్ మాస్టర్ ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించారు రాకేష్ మాస్టర్.అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా ఆయన పాల్గొన్నారు.2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ కూడా ప్రకటించారు.

ఇంట్లో చెప్పకుండా ఎవరికీ తెలియకుండా ఎన్టీ రామారావు గారిని చూసేందుకు రైలు పట్టాలపై నడుచుకుంటూ చెన్నై వెళ్ళేవాడిని అని రాకేష్ మాస్టర్ తెలిపారు.అప్పుడు చిరంజీవి, రజనీ కాంత్ రోడ్లపై తిరుగుతూ ఉండేవారని, అప్పుడు తాను వాళ్ళని పట్టించుకునే వాడిని కాదని ఆయన అన్నారు.

 Rakesh Master Sensational Comments On Chiranjeevi Rajinikanth-చిరంజీవి, రజినీకాంత్ లు రోడ్డు మీద తిరిగేవాళ్ళు.. రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా రజనీ కాంత్, శోభన్ బాబు తనతో చాలా క్లోజ్ గా ఉండేవారని రాకేష్ మాస్టర్ తెలిపారు.అంతే కాకుండా వాళ్లకు తాను మందు కూడా పోసే వాడినని ఆయన అన్నారు.తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి బట్టల షాప్ లో పెట్టారని ఆయన వివరించారు.

ఆ సమయంలో తమిళుల చేత చాలా తిట్లు పడ్డానని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.అందుకే తనకు తమిళులు అంటే కోపం అని ఆయన వివరించారు.ఆ సమయంలో తన అన్నయ్య వచ్చి ఆయన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లారని రాకేష్ మాస్టర్ తెలిపారు.

#Rakesh Master #Tollywod #Chiranjeevi #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube