బిగ్ బాస్ ఓటీటీలోకి రాకేష్ మాస్టర్.. ఈసారి షో మాములుగా ఉండదుగా!

తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్స్ సంపాదించుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా నిలిచిన బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అన్ని భాషలలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

 Rakesh Master Into Bigg Boss Ott This Time The Show Is Not Normal , Bigg Boss, New Season, Ott, Rakesh Master , Durga Rao , Raju , Vandana-TeluguStop.com

ఇక తెలుగులో ఇప్పటికే ఈ కార్యక్రమం ఏకంగా 5 సీజన్లను పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇకపై ఓటీటీలోకి వస్తున్న విషయాన్ని నాగార్జున ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Rakesh Master Into Bigg Boss OTT This Time The Show Is Not Normal , Bigg Boss, New Season, Ott, Rakesh Master , Durga Rao , Raju , Vandana-బిగ్ బాస్ ఓటీటీలోకి రాకేష్ మాస్టర్.. ఈసారి షో మాములుగా ఉండదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే 24 గంటల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రసారం కానుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నపటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేదు.అయితే ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తి అయిందని వార్తలు వినబడుతున్నాయి.

ఈ క్రమంలోనే బిగ్ బాస్  ఓటీటీలోకి ఢీ-10′ విజేత రాజు, దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష పేర్లు వినపడుతున్నాయి.

Telugu Bigg Boss, Durga Rao, Season, Raju, Rakesh Master, Vandana-Movie

తాజాగా ఈ కార్యక్రమానికి కాంట్రవర్సీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్ గా వెళ్తున్నట్లు తెలుస్తోంది.ఈయన ఈ మధ్యకాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తిని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపిస్తే షో మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube