ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్టర్.సోషల్ మీడియా గురించి కాస్తో, కూస్తో తెలిసి వారికి ఎవరికా ఇతడు ఎక్కడో ఒక చోట తగిలే ఉంటాడు.

 Rakesh Master In Relationship Third Time, Rakesh Master, Third Marriage, Dance M-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న వారందరికీ ఇతడే గురువు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.తన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న పలువురు ఇప్పుడు చాలా మంచి పొజిషన్ కు వెళ్లారు.

తన పరిస్థితి మాత్రం రోజు రోజుకూ దిగజారుతోంది.

గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పలువురు నటీమణులతో పాటు నటులు, కొరియోగ్రఫర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తీవ్ర పదజాలంతో నిప్పులు చెరుగుతున్నారు.అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ రెండో భార్యతో పాటు కొడుకుపై కొందరు పీకే అభిమానులు దాడికి యత్నించారు.దీంతో అప్పటి నుంచి తన భార్యతో పాటు కుమారుడు అతడికి దూరంగానే ఉంటున్నారు.

తాము బతికి ఉన్నా చనిపోయినట్లుగానే అనుకోవాలని తన భార్య తేల్చి చెప్పింది.ఏం చేయాలో తెలియక కొంత కాలంగా ఒంటరిగానే ఉన్నాడు రాకేష్ మాస్టార్.

తాజాగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు రాకేష్ మాస్టార్.రాజుల కుటుంబానికి చెందిన ఈ మహిళతో కొంత కాలంగా కలిసి ఉంటున్నట్లు చెప్పాడు.అంతే కాదు.తన మూడో భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ కు ఇంటర్వ్యూకు వచ్చాడు.

ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన జంటకు మంగళహారతులతో స్వాగతం పలికారు.తమ ఇద్దరి మనసులు కలిసినందు వలనే ఇద్దరం కలిసి ఉంటున్నట్లు రాకేష్ మాస్టర్ చెప్పాడు.

తాము వివాహం చేసుకోలేదని.సహజీవనం మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించాడు.

తనకు అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉంటుందన్నాడు.చివరకు మద్యం కావాలన్నా తనే తెచ్చి పోస్తుందని చెప్పాడు.

కష్ట సుఖాల్లో కలిసి ఉంటున్నందునే ఇద్దరం హ్యాపీగా ఉంటున్నట్లు చెప్పారు.తనను అమ్మలా చూసుకుంటున్నట్లు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube