జబర్దస్త్‌: బాబోయ్‌ వీళ్లు రాకేష్‌ మాస్టర్‌తో కూడా చీర కట్టించేశారు

జబర్దస్త్‌ కామెడీ షో తెలుగు బుల్లి తెరల ఫార్మట్ ను మార్చేశాయి.ఎన్నో తెలుగు షో లు జబర్దస్త్‌ ఆధారంగా వచ్చాయి.

 Rakesh Master Also In Saree Jabardasth Effect , Rakesh Master, Roja, Jabardasth,-TeluguStop.com

కొన్ని కామెడీ షో లు జబర్దస్త్‌ ను ఉన్నది ఉన్నట్లుగా దించేశాయి.అయినా కూడా అవి సక్సెస్‌ అవ్వలేదు.9 ఏళ్లు అవుతున్నా కూడా జబర్దస్త్‌ మాత్రం సూపర్‌ సక్సెస్ తో దూసుకు పోతూనే ఉంది.ఒక షో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా సాగడం అంటే మామూలు విషయం కాదు.

ఈ షో లో ఎంతో మంది సినీ ప్రముఖులు కనిపించారు.ఇప్పుడు యూట్యూబ్‌ సెన్షేషనల్‌ అయిన రాకేష్‌ మాస్టర్‌ కూడా ఇప్పుడు ఈ షో లో కనిపిస్తున్నాడు.

బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్ లో నరేష్ మరియు రాకేష్‌ మాస్టర్‌ చేసే విన్యాసాలు అన్ని ఇన్ని కావు.ఎంతో సీనియర్ అయిన రాకేష్‌ మాస్టర్‌ ను మరీ చిల్లర కామెడీ చేసి పరువు తీస్తున్నాయి.

ఆయనే గతంలో యూట్యూబ్‌ వీడియోల్లో రచ్చ రచ్చ చేసి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు.ఇప్పుడు బుల్లి తెరపై జబర్దస్త్‌ లో కనిపిస్తున్నాడు.

జబర్దస్త్‌ లో ఎంతటి కమెడియన్ అయినా కూడా ఏదో ఒక సమయంలో చీర కట్టాల్సిందే.రాకేష్‌ మాస్టర్‌ కు కూడా చీర కట్టేశారు.వచ్చే వారం రాబోతున్న ఎక్ట్సా జబర్దస్త్‌ లో రాబోతున్న భాస్కర్‌ టీం స్కిట్‌ లో రాకేష్‌ మాస్టర్‌ చీర కట్టుకున్నాడు.అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

బాబోయ్‌ ఏంటీ ఈ రచ్చ అన్నట్లుగా నెటిజన్స్‌ కేకలు పెడుతున్నారు.అద్బుతమైన రాకేష్‌ మాస్టర్‌ స్వయం కృతం వల్ల తాగి వాగడం వల్ల మొత్తం ప్రాభవంను కోల్పోయాడు.

ఇలాంటి రాకేష్‌ మాస్టర్‌ ఇప్పుడు ఏకంగా చీర కట్టుకుని జబర్దస్త్‌ కామెడీ షో లో తైతక్కలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది.ఏమాటకు ఆమాట వినోదిని, సాయి మాదిరిగా రాకేష్‌ మాస్టర్‌ కూడా చీర కడితే భలేగా కుదిరిపోయాడు.

నిజంగా లేడీనా అన్నట్లుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Telugu Bullet Bhaskar, Cheap, Jabardast, Rakesh Master, Roja-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube