విమానయాన రంగంలోకి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. ఎగిరిన కొత్త సంస్థ విమానం..!

భారతదేశంలో మరొక కొత్త ఎయిర్‌లైన్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సపోర్ట్ చేస్తున్న ‘ఆకాశ ఎయిర్‘ తాజాగా తన సేవలను ప్రారంభించింది.

 Rakesh Jhunjhunwala In Aviation Sector ,flight , Akash Air, Jyotiradhitya Scindi-TeluguStop.com

పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నిన్న అంటే ఆగస్టు 7న ఆకాశ ఎయిర్ విమాన సేవలను లాంచ్ చేశారు.ఈ విమానయాన సంస్థలకు చెందిన మొట్టమొదటి ఫ్లైట్ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణించింది.

దీంతో భారత విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యయనం మొదలయ్యింది.

భారతదేశంలోని విమానయాన సంస్థలు అన్నీ కూడా అంతగా లాభాలతో నడవడం లేదు.

దీంతో పదేళ్లకాలంలో ఎన్నో సంస్థలు చాప చుట్టేశాయి.ఇలాంటి సమయంలో ఆకాశ ఎయిర్ కంపెనీ విమానయాన సేవలను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీంతో ఎయిర్‌లైన్స్ ఫీల్డ్‌లో కొత్త అవకాశాలు సృష్టించినట్లు అయింది.ఈ సర్వీసులు లాంచ్ చేసిన సందర్భంగా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో విమానయాన రంగానికి సంబంధించి అనుమతులు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందనే సందేహాలు ఉండేవి.కానీ ఇప్పుడు ఆ సందేహాలన్నీ తీరి పోయాయని అన్నారు.

ఆకాశ ఎయిర్ సంస్థ కేంద్ర సహాకారంతో స్వల్ప కాలంలోనే తన సేవలను అందుబాటులోకి తేగలిగిందన్నారు.ప్రపంచంలోని ఏ విమానయాన సంస్థ కూడా అది ఏర్పాటైన ఒక సంవత్సర కాలంలోనే తన సేవలను మొదలుపెట్టిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

దీనంతటికి కారణం ప్రభుత్వమేనని కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Telugu Akash Air, Bigbull, Ups-Latest News - Telugu

ఇదిలా ఉండగా, కంపెనీ తన రెండో విమానాన్ని ఆగస్టు 13న బెంగళూరు నుంచి కొచ్చికి నడపనుంది.అలానే ఆగస్టు 19న బెంగళూరు నుంచి ముంబైకి సెప్టెంబర్ 15న చెన్నై నుంచి ముంబై మధ్య విమానాల సేవలను అందుబాటులోకి తేనుంది.2022లో నెలనెలా రెండు కొత్త విమానాలను ప్రారంభిస్తామని సంస్థ వెల్లడించింది.అయితే ఈ సంస్థ ప్రస్తుతం మొత్తం 72 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube