ఇది పార్లమెంట్‌ అనుకున్నారా? బజారు అనుకున్నారా?

పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇటీవల దిల్లీలో జరిగిన అల్లర్ల విషయమై అట్టుడుకుతున్నాయి.ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అంటూ విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 Rajyasabha Chairman Venkaiah Naidu Give The Warning To Oppostion Party Leaders-TeluguStop.com

నేడు కూడా ఈ విషయమై తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ ఆ విషయమై చర్చ జరపాల్సిందే అంటూ పార్లమెంటు ఉభయ సభలను విపక్ష పార్టీలు అడ్డుకున్నారు.

దాంతో కొందరు ఎంపీలను సస్పెండ్‌ కూడా చేయడం జరిగింది.

రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తూ సభను అట్టుడికిస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నోటీసులు ఇవ్వకుండా చర్చకు డిమాండ్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.ఇదేమైనా పార్లమెంట్‌ అనుకున్నారా లేదంటే బజారు అనుకున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.పార్లమెంట్‌ సభ్యులుగా హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అంటూ పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube