మెగాస్టార్ కు రాజ్యసభ ? ప్రతిపాదనల్లో వైసీపీ ?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ యాక్టీవ్ అయ్యారు.అంతే కాదు సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.

 Rajya Sabha To Megastar Ycp In The Proposals-TeluguStop.com

కరోనా విపత్తులో ఆక్సిజన్ బ్యాంక్స్, అంబులెన్స్ సర్వీస్ లు ఉచితంగా ఏర్పాటు చేశారు.అదీ కాకుండా ఎన్నికల సమయానికి జనసేన తరపున యాక్టివ్ అవుతారు అని ఒక వైపు సంకేతాలు వెలువడుతుండగా,  ఇప్పుడు అదే మెగా స్టార్ ను ఉపయోగించుకుని తమకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వైసిపి భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు బీజేపీ , జనసేన పార్టీల కూటమి తరపున పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యం పెంచడంతో పాటు,  అవసరమైతే రాజ్యసభ కోటలో కేంద్రమంత్రిగా అవకాశం కల్పిస్తారని, దీని ద్వారా కాపు సామాజిక వర్గం మద్దతుతో పాటు, కోస్తా ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించాలని ఆలోచనలు బిజెపి ఉంది.

 Rajya Sabha To Megastar Ycp In The Proposals-మెగాస్టార్ కు రాజ్యసభ ప్రతిపాదనల్లో వైసీపీ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇదే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసిపి అలెర్ట్ గా వ్యవహరిస్తోంది.ఏపీలో ప్రధానంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ-జనసేన టిడిపిలకు అవకాశం దక్కకుండా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ని వాడుకోవాలనే ఆలోచనలో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే చిరంజీవి కి రాజ్యసభ సభ్యడిగా అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.చిరంజీవి ఒక్కడికి రాజ్యసభ సభ్యుడుగా అవకాశం కల్పిస్తే , మూడు పార్టీలకు చెక్ పెట్టడంతో పాటు , జనసేన కు డైవర్ట్ అయ్యే కాపు సామాజిక వర్గ ఓట్లను తమ వైపుకు వచ్చేలా చేసుకుని మళ్లీ సులువుగా అధికారంలోకి వచ్చేందుకు సాధ్యం అవుతుంది అనేది జగన్ అభిప్రాయంగా ఉంది.

Telugu @janasenaparty, Ap, Ap Politics, Bjp, Cbn, Chandrababu, Jagan, Jagan And Chiru, Megastar Chiranjeevi, Pawan Cm Candidate, Tdp, Ysrcp Mp Chiranjivi-Telugu Political News

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ చిరంజీవి మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడడం  అనేక సందర్భాల్లో జగన్ పరిపాలనను చిరంజీవి పొగడడం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను చిరంజీవి జగన్ వద్ద ప్రస్తావించినప్పుడు వాటికి పరిష్కారం చూపించడం, ఇలా ఎన్నో అంశాలలో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉంది అనే విషయం రుజువు అయ్యింది.ఇప్పుడు ఆ చొరవతో నే చిరు వద్ద జగన్ ఈ ప్రతిపాదన పెట్టే ఆలోచనలో ఉన్నారట.

#Jagan #@JanaSenaParty #AP Politics #YsrcpMp #Jagan And Chiru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు