తమ్ముడి కోసం ఓంకార్‌ 'రాజుగారి గది 3'  

Rajugar Gadi 3 Will Starts Soon-

బుల్లి తెర సెన్షేషన్‌గా గుర్తింపు దక్కించుకున్న ఓంకార్‌ ప్రస్తుతం దర్శకుడిగా కూడా కొనసాగుతున్న విషయం తెల్సిందే.అయితే ఈయన వరుసగా సినిమాలు చేయకుండా అడపా దడపా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.

Rajugar Gadi 3 Will Starts Soon--Rajugar Gadi 3 Will Starts Soon-

ఇప్పటికే ఈయన రాజుగారి గది మరియు రాజుగారి గది 2 అనే చిత్రాలను తెరకెక్కించాడు.ఆ రెండు సినిమాల్లో మొదటిది సూపర్‌ హిట్‌ అవ్వగా రెండవది యావరేజ్‌గా నిలిచింది.రాజుగారి గది 2లో నాగార్జున మరియు సమంతలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే.

Rajugar Gadi 3 Will Starts Soon--Rajugar Gadi 3 Will Starts Soon-

మొదటి రెండు పార్ట్‌లలో కూడా దర్శకుడు ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌బాబు కీలక పాత్రలో నటించాడు.తమ్ముడిని హీరోగా లేదంటే కనీసం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

కాని అశ్విన్‌ బాబుకు మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు.రాజుగారి గది చిత్రంలో అశ్విన్‌బాబు హీరోగా నటించాడు.రెండవ పార్ట్‌లో నాగార్జున ఉన్న కారణంగా అశ్విన్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.అందుకే ఈసారి మూడవ పార్ట్‌ను కేవలం అశ్విన్‌ కోసమే తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

నేడు లాంచనంగా ప్రారంభం అయిన రాజు గారి గది 3 చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను రేపటి నుండే ప్రారంభించబోతున్నారు.ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో తమన్నా నటించబోతుంది.ఈమద్య కాలంలో తమన్నా హర్రర్‌ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది.అందుకే ఈ చిత్రంలో తమన్నాను ఓంకార్‌ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో అయినా ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబుకు సక్సెస్‌ దక్కేనా చూడాలి.