దర్శకుడి గా మారుతున్న మరో డ్యాన్స్ మాస్టర్  

దర్శకుడుగా మారుతున్న రాజు సుందరం. .

Raju Sundaram Try To Become A Director-raju Sundaram,telugu Cinema,tollywood,try To Become A Director

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత దర్శకులుగా మారిన వారి జాబితా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకుడిగా మారి సక్సెస్ కాగా, ప్రభుదేవా ఏకంగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అమ్మ రాజశేఖర్, బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకులుగా మారిపోయి సక్సెస్ కొట్టారు..

దర్శకుడి గా మారుతున్న మరో డ్యాన్స్ మాస్టర్-Raju Sundaram Try To Become A Director

ఇదే దారిలో యువ కొరియోగ్రాఫర్లు కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఫేమస్ కొరియోగ్రాఫర్, ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం కూడా త్వరలో దర్శకత్వం వైపు రాబోతున్నట్లు తెలుస్తుంది.దీని కోసం అతను ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాడు అని సమాచారం.

పదకొండేళ్ల క్రితం రాజు సుందరం ఎగన్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ అటువైపు దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు రాజుసుందరం మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అతను ఈ హీరో శర్వానంద్ కలిసి కథ కూడా చెప్పినట్లు సమాచారం. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అని హీరో శర్వానంద్ చెప్పడంతో ఇప్పుడు రాజు సుందరం స్క్రిప్టు ఫినిష్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అన్నయ్య ప్రభుదేవా బాటలోనే రాజు సుందరం కూడా దర్శకుడిగా తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం.