హైపర్‌ ఆది అతడిని కూడా సైడ్ చేశాడా పాపం

తెలుగు బుల్లి తెరపై కామెడీ షో అనగానే గుర్తుకు వచ్చే పేరు జబర్దస్త్‌ అనడంలో సందేహం లేదు.ఎన్నో సూపర్‌ హిట్ స్కిట్స్ ను చేసిన జబర్దస్త్‌ కామెడీ షో దశాబ్ద కాలం దగ్గరకు వస్తుంది.

 Raju Out From Jabardast Comedy Show Hyper Adi Only Lead Team, Etv , Fil News , H-TeluguStop.com

అయినా కూడా షోను చూస్తున్న వారు ఆధరిస్తున్న వారు చాలా మందే ఉన్నారు.అద్బుతం అంటూ కామెడీని ఎంజాయ్‌ చేస్తున్న వారు చాలా మంది ఉంటే బూతు షో అంటూ కామెంట్స్ చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు.

మొత్తానికి హైపర్‌ ఆది వంటి ఎంతో మందికి ఇది ఒక గొప్ప వరంగా మారింది.ఉద్యోగం లేక తిరుగుతున్న హైపర్‌ ఆది అదిరే అభి టీమ్ లో కనిపించాడు.

ఆ తర్వాత అతడి కామెడీ టైమింగ్‌ మరియు ఇతర విషయాలు నచ్చిన అదిరే అభి ఫుల్‌ లెంగ్త్‌ స్కోప్ ఉన్న రోల్స్ ఇచ్చాడు.దాంతో మెల్ల మెల్లగా దూకుడు పెంచిన ఆది ఆ తర్వాత హైపర్‌ ఆదిగా మారి పోయాడు.

రైజింగ్‌ రాజుతో కలిసి హైపర్‌ ఆది టీమ్‌ ఫామ్‌ అయ్యింది.అదిరే అభి ని సైడ్ చేసిన ఆది ఆ తర్వాత స్టార్‌ గా ఎదిగి పోయాడు.

హైపవర్ ఆది రైజింగ్‌ టీమ్‌ పేరు అయినా కూడా మొత్తం లీడ్‌ చేసేది హైపర్‌ ఆది అనడంలో సందేహం లేదు.గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి టీమ్ అలా కొనసాగుతూనే ఉంది.

అయితే ఈమద్య కాలంలో హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్‌ లో కేవలం ఆది మాత్రమే కనిపిస్తున్నాడు.మూడు నాలుగు వారాలుగా రాజు కనిపించక పోవడంతో మొదట ఒకటి రెండు వారాలు ఏమైనా సమస్యల వల్ల రాలేదేమో అనుకున్నారు.

కాని ఇప్పుడు మాత్రం ఆది ఒక్కడే టీమ్‌ చేస్తున్నాడు.రాజును పక్కకు పెట్టేసినట్లే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఆది మరియు రాజులు కలిసి ఎన్నో స్కిట్ లు చేశారు.

Telugu Hyper Adi, Jabardast, Jabardasth, Mallemala, Raju-Movie

అయితే అందులో ప్రతి స్కిట్ కూడా డామినేషన్ ఆదిదే అనడంలో సందేహం లేదు.అలాంటిది ఇప్పుడు మళ్లీ రాజును సైడ్ చేసి తాను ఒక్కడే సోలోగా టీమ్‌ ను లీడ్‌ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఇప్పటి వరకు టీమ్ పేరును మాత్రం మార్చలేదు.

కనుక రాజు మళ్లీ వస్తాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube