ట్రైలర్‌ టాక్‌ : ఈసారి ఇంకాస్త ఎక్కువ భయపెట్టేలా ఉన్నాడే, కాని అది మిస్‌  

Raju Gari Gadhi 3 Trailer Talk-avik Ghor,nagarjuna,omkar,raju Gari Gadhi 3,release In Dussara,samantha

బుల్లి తెర నుండి వెండి తెరకు షిఫ్ట్‌ అయిన ఓంకార్‌ వరుసగా ‘రాజు గారి గది’ చిత్రం సిరీస్‌లో సినిమాలు చేస్తున్నాడు.ఒకదానికి ఒకదానితో సంబంధం లేకుండా కథలు సిద్దం చేసుకుంటూ చేస్తున్నాడు.లారెన్స్‌ ముని సీక్వెన్స్‌ తరహాలోనే రాజు గారి గది చిత్రంకు సంబంధించిన పార్ట్‌లు తెరకెక్కిస్తున్నాడు.రాజుగారి గది 1 మంచి హిట్‌ అయ్యింది.ఆ సినిమా అంత హిట్‌ అవ్వడానికి ప్రధాన కారణం కామెడీ.ఆ చిత్రంలోని కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక రెండవ పార్ట్‌లో నాగార్జున, సమంతలతో సీరియస్‌గా కథ సాగించాడు.

Raju Gari Gadhi 3 Trailer Talk-avik Ghor,nagarjuna,omkar,raju Gari Gadhi 3,release In Dussara,samantha-Raju Gari Gadhi 3 Trailer Talk-Avik Ghor Nagarjuna Omkar Raju Release In Dussara Samantha

Raju Gari Gadhi 3 Trailer Talk-avik Ghor,nagarjuna,omkar,raju Gari Gadhi 3,release In Dussara,samantha-Raju Gari Gadhi 3 Trailer Talk-Avik Ghor Nagarjuna Omkar Raju Release In Dussara Samantha

రెండవ పార్ట్‌ ఫలితం ఏంటో తెల్సిందే.నాగార్జున ఉన్నా కూడా ఆ సినిమా నిరాశ పర్చింది.సమంత నటించినా కూడా రాజుగారి గది 2 ఆకట్టుకోలేక పోయింది.ఇక రాజు గారి గది 3 రాబోతుంది.ఈ చిత్రంలో మొదటి రెండు పార్ట్‌లలో నటించిన అశ్విన్‌ బాబు హీరోగా నటించగా, అవిగా గౌర్‌ హీరోయిన్‌గా నటించింది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.సినిమాను రెండు మూడు నెలల్లోనే షూటింగ్‌ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశాడు.

దసరా సందర్బంగా ఈ చిత్రంను విడుదల చేస్తామంటూ ఓంకార్‌ ప్రకటించాడు.రాజు గారి గది 3 ట్రైలర్‌ను చూస్తు హర్రర్‌ ఎక్కువ ఉండి హ్యూమర్‌ తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.తెలుగు ఆడియన్స్‌ కేవలం హ్యుమర్‌ అంటే కామెడీని మాత్రమే ఆశిస్తున్నారు.తెలుగు వారి అభిరుచికి తగ్గట్లుగా లేని కారణంగానే ‘రాజు గారి గది 2’ చిత్రం నిరాశ పర్చింది.ఇప్పుడు 3 లో కూడా కామెడీ తక్కువగానే అనిపిస్తుంది.ధన్‌ రాజ్‌ మాత్రమే కమెడియన్‌ కనిపిస్తున్నాడు.హర్రర్‌ మరీ ఎక్కువ అయ్యిందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.గత రెండు పార్ట్‌లతో పోల్చితే ఎక్కువ భయపెట్టడం కన్ఫర్మ్‌ అనిపిస్తుంది.కాని కామెడీ మాత్రం మిస్‌ అవ్వడంతో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.