రాజు గారి గది 2 మూవీ రివ్యూ  

3.

  • చిత్రం : రాజు గారి గది 2
    బ్యానర్ : PVP సినిమా
    దర్శకత్వం : ఓంకార్
    నిర్మాత : పివిపి
    సంగీతం : తమన్
    విడుదల తేది : అక్టోబర్ 13, 2017
    నటీనటులు : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్ బాబు తదితరులు

  • కథలోకి వెళితే :

  • ముగురు స్నేహితులు అశ్విన్, వెన్నెల కిషోర్ ఒక సి సైడ్ రిసార్ట్ కొనుగోలు చేస్తారు. కాని ఆ రిసార్ట్ కొన్నప్పటి నుంచి వారి జీవితాలు దుర్భరం అవుతాయి. ఆ రిసార్ట్ లో ఒక ఆత్మ ఉంది. అదే వారిని భయపెడుతోంది. దాంతో ఒక మెంటలిస్టు రుద్రని (నాగార్జున) ఆశ్రయిస్తారు ఆ ముగ్గురు స్నేహితులు. ఇంతకి రుద్ర ఆ ఆత్మ నుంచి వారికి విముక్తి కలిగించగలిగాడా? ఈ కథలో అమృత (సమంత) కి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెరపైనే చూడండి.

  • నటీనటుల నటన :

  • మెంటలిస్టుగా నాగార్జున పాత్ర ఈ సినిమాకి ఆయువుపట్టు. రాజు గారి గదిలో మిస్ అయిన ఆ స్టార్ బలం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ నాగార్జున మోస్తే సెకండాఫ్ చాలావరకు తన మీద వేసుకుంది సమంత. బాగా రాసుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసింది తను. అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్ మరియు ప్రవీణ్ లు నవ్వించడానికి బాగా ప్రయత్నించిన, రాసుకున్న కామెడి సీన్స్ బాగా లేకపోయేసరికి తేలిపోతాయి అవి. సీరత్ కపూర్ గ్లామర్ షో యువతని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

  • టెక్నికల్ టీం :

  • ఈ సినిమాకి ముగ్గురు హీరోలు. నాగార్జున, ఓంకార్ మరియు తమన్. తమన్ బ్యాక్ గ్రౌండ్ మాస్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే చించేసాడు. రుద్ర ట్రాక్ యూట్యూబ్ లో విడుదల చేస్తే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయేమో. సినిమాలో ఉన్న ఎమోషన్స్ ని కూడా బాగా ఎలివేట్ చేసాడు. సినిమాటోగ్రాఫీ బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ కొద్దిగా పట్టు తప్పుతుంది. అలాగే సెకండాఫ్ చివర్లో కూడా టెంపో ఉండదు. నిర్మాణ విలువలు సూపర్. పివిపి సినిమా అన్నప్పుడు ఆ మాత్రం ఉండాల్సిందే.

  • విశ్లేషణ :

  • ఓ కొత్త ప్రదేశానికి వ్యక్తులు వెళ్ళడం అక్కడ అప్పటికే ఒక ఆత్మ ఉండటం, కథనాయుకుడి ప్రయత్నాల తరువాత ఆ ఆత్మకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండటం, ఎన్ని సినిమాలు చూడలేదు ఇలాంటివి అంటూ అప్పుడే ఈ సినిమా మీద ఓ నిర్ణయానికి వచ్చేయకండి. స్క్రీన్ ప్లీ పాతదే. కాని ట్రీట్మెంట్ కొత్తగా ఇచ్చారు. నాగార్జున పాత్ర ఈ సినిమా ఫ్రెష్ నెస్ తీసుకొస్తే, ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గా పెట్టలేదు. హర్రర్ అంశాలు మరీ ఎక్కువ ఊహించుకోవద్దు. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఒక డిఫరెంట్ రూట్ లో వెళుతుంది సినిమా. కాని ద్వితియార్థమే ఈ సినిమాకి ఓ అర్థాన్ని ఇస్తుంది. అదేమిటో మేము చెప్పకూడదు కాని, కుటుంబ ప్రేక్షుకులు కూడా కనెక్ట్ అయిపోతారు. కామెడి పేలకపోవడం ఒక మైనస్ పాయింట్. ఓవరాల్ గా చెప్పాలంటే, సినిమా హిట్.

  • ప్లస్ పాయింట్స్ :

  • * నాగార్జున – సమంత
    * సెకండాఫ్
    * టెక్నికల్ అంశాలు
    * సంగీతం

  • మైనస్ పాయింట్స్ :

  • * తేలిపోయిన కామెడి
    * కొన్ని అనవసరపు సన్నివేశాలు

  • చివరగా :

  • నాగార్జున చెప్పినట్లే “వచ్చారు … కొట్టారు”.

  • తెలుగు స్టాప్ రేటింగ్ : 3/5