ఆచారానికి విరుద్ధంగా ప‌నిచేస్తుందంటూ కోడ‌లి త‌ల న‌రికాడు ఆ మామ‌..! ఇంతకీ ఆ కోడలు ఏం చేసిందో తెలుసా.?  

  • మ‌హిళ‌లు అంటే కేవ‌లం ఇంటికే అది కూడా కేవ‌లం వంట‌గ‌దికే ప‌రిమితం కావాలి. వారు ఏ మాత్రం ఇల్లు దాటి కాలు బ‌య‌ట పెట్ట‌రాదు… ఇదీ మ‌న దేశంలో ఎప్ప‌టినుంచో అమ‌లులో ఉన్న సాంఘిక దురాచారం. ఈ దురాచారం వ‌ల్ల ఎంతో మంది మ‌హిళలు బ‌ల‌వుతున్నారు. అయితే నేటి ఆధునిక యుగంలో దీని ప్ర‌భావం కొంత త‌గ్గింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయినా ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సాంఘిక దురాచారాన్ని ఇంకా కొంద‌రు పాటిస్తున్నారు. దీని మూలాన తాజాగా ఓ అభం శుభం తెలియ‌ని మ‌హిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

  • అది రాజ‌స్థాన్‌లోని అల్వార్ అనే ప్రాంతంలో ఉన్న షాజ‌హాన్ పూర్ గ్రామం. అక్క‌డ ముఖేష్ రాజ్‌పుత్‌, ఉమా అనే దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు సంతానం. అయితే వీరిది పేద కుటుంబం కావ‌డంతో ముఖేష్‌తోపాటు అత‌ని భార్య ఉమా కూడా ప‌నిచేసేది. కానీ ఈ విష‌యం ముఖేష్ పెద‌నాన్న మామ్‌రాజ్‌కు న‌చ్చేది కాదు. ఉమ స్కూల్‌లో ప‌నిచేస్తుండ‌డంతో ఆమెకు మామ్ రాజ్ ఆ పని మానేయాల‌ని, అది త‌మ రాజ్ పుత్ వంశ ఆచారానికి విరుద్ధ‌మ‌ని, త‌మ వంశానికి చెందిన వారు ఇంట్లోనే ఉండాల‌ని, బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని అనేవాడు. అయితే ఆమె స్కూల్‌లో మానేసినా మ‌రో ఫ్యాక్ట‌రీలో ప‌నిలో చేరింది.

  • Rajput Women Going Out To Work  Man Chops Off Daughter-in-law's Head-Daughter-in-law\'s Head Rajasthan Rajput

    Rajput Women Going Out To Work, Man Chops Off Daughter-in-law's Head

  • ఈ క్ర‌మంలోనే తాను ఎంత చెప్పినా ఉమా వినిపించుకోవ‌డం లేద‌ని భావించిన మామ్‌రాజ్ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసేందుకు వెళ్తున్న ఉమ‌ను దారిలో అట‌కాయించాడు. గ్రామంలో ఉన్న ఖాటుష్యాం అనే ఆల‌యం వ‌ద్ద ఆమెను అడ్డుకున్నాడు. అప్పుడు ఆ దారిలో ఒక‌రిద్ద‌రు వెళ్తున్నా వారు మామ్‌రాజ్ చేసే ప‌నికి అడ్డు చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలో మామ్ రాజ్ ఉమ‌ను అడ్డుకుని త‌న‌తో తెచ్చుకున్న పొడ‌వాటి క‌త్తితో ఉమ త‌ల‌ను న‌రికేశాడు. దీంతో స్థానికుల స‌మాచారం అందుకున్న పోలీసులు మామ్ రాజ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. చూశారు క‌దా ఆ సాంఘిక దురాచారం ఎంత‌టి ప‌ని చేసిందో. ఇలాంటి వారికి అస‌లు స‌మాజంలో బ‌తికే అర్హ‌తైతే లేదు. ఏమంటారు!