భద్రత కోసమే, భయపెట్టడానికి కాదన్న రాజ్‌నాధ్‌

భారత అమ్ములపొదిలోకి అతి త్వరలోనే రాఫెల్‌ యుద్ద విమానాలు వచ్చి చేరబోతున్నాయి.ప్రాన్స్‌లో డసో ఏవియేషన్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాఫెల్‌ యుద్ద విమానాలు ఇండియాకు రాబోతున్నాయి.

 Rajnath Singh Comments On Raffel War Planes-TeluguStop.com

ప్రాన్స్‌ చేరిన రాజ్‌నాధ్‌ సింగ్‌ అక్కడ రాఫెల్‌ యుద్ద విమానాలకు ఆయుద పూజ నిర్వహించి 20 నిమిషాల పాటు ఆయన రాఫెల్‌ యుద్ద విమానంలో చక్కర్లు కొట్టాడు.రాఫెల్‌ యుద్ద విమానల కొనుగోలు విషయమై భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరించింది.

అన్ని కట్టుదిట్టంగా చర్చలు జరిపి 2022 వరకు పూర్తి స్థాయి యుద్ద విమానాలను సమకూర్చుకునేందుకు సిద్దం అయ్యింది.

ఇక ప్రాన్స్‌ వెళ్లి అక్కడ రాఫెల్‌లో ప్రయాణించిన రాజ్‌నాధ్‌ సింగ్‌ మాట్లాడుతూ.

దేశ భద్రత తమకు ముఖ్యం.తమ సామర్థ్యంను పెంచుకునే ఉద్దేశ్యంతో తాము రాఫెల్‌ యుద్ద విమానాలు తీసుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

ఇతర దేశాలను భయపెట్టేందుకు తాము రాఫెల్‌ యుద్ద విమానాలను తీసుకోవడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.తమ దేశం కోసం తాము ఈ విమానాలను కొనుగోలు చేసినట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube