రాజీవ్ ని తిట్టారు.. సుమతో ఎలా అంత క్లోజ్ ఉన్నారు.. అన్నపూర్ణమ్మపై ఫైర్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా కొనసాగుతున్న అన్నపూర్ణమ్మ గత కొన్ని రోజుల క్రితం సినిమా పెద్ద, రచయిత, నటుడు దేవదాసు కనకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన తండ్రి ఒక ల్యాండ్ విషయంలో తనని దారుణంగా మోసం చేశాడని దేవదాసు కొడుకు రాజీవ్ కనకాల పై కూడా అన్నపూర్ణమ్మ తీవ్రస్థాయిలో మండిపన సంగతి మనకు తెలిసిందే.

 Rajiv Was Scolded How Close You Are With Suma Fire On Annapoornamma-TeluguStop.com

తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “స్టార్ మ్యూజిక్” అప్ కమింగ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి సీనియర్ యాక్టర్ లతో పాటు, అన్నపూర్ణమ్మ కూడా వచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణమ్మ యాంకర్ సుమతో ఎంతో క్లోజ్ గా వ్యవహరించారు.ఈ విధంగా వీరిద్దరూ ఈ కార్యక్రమంలో ఎంతో క్లోజ్ గా ఉండటం చూసిన నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Rajiv Was Scolded How Close You Are With Suma Fire On Annapoornamma-రాజీవ్ ని తిట్టారు.. సుమతో ఎలా అంత క్లోజ్ ఉన్నారు.. అన్నపూర్ణమ్మపై ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే నెటిజన్లు స్పందిస్తూ… అదేంటి ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ రాజీవ్ కనకాల తండ్రి తనని మోసం చేశారని,ఈ విషయం రాజీవ్ కనకాల దగ్గర ప్రస్తావించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, తను ల్యాండ్ నాకు అమ్మిన విషయం రాజీవ్ కుటుంబానికి తెలుసంటూ.ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి సుమతో ఈ విధంగా సరదాగా, అంత క్లోజ్ గా ఎలా ఉన్నారంటూ అన్నపూర్ణమ్మ పై నెటిజన్లు ఫైర్ అవుతూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

#Netizens #Annapoornamma #Anchor Suma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు