చిరు,బాలయ్య,వెంకీ,నాగ్ లను ఇమిటేట్ చేసిన రాజివ్! చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!     2018-07-18   11:39:00  IST  Sai Mallula

రాజివ్ కనకాల ..మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు..హీరోగా అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు పోషించాడు అయినా కూడా రాజివ్ కి తగిన పాత్ర ఇంకా దొరకలేదనే చెప్పాలి.ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నఅందరి నటుల ,దర్శకుల సినిమాల్లో నటించారు రాజివ్ ..ఒక్క చిరంజీవి సినిమాలో తప్ప..బాలక్రిష్ణ,వెంకీ,నాగార్జున తో నటించిన అనుభవాల్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు..

రాజీవ్ కనకాల బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆయన తండ్రి దేవదాస్ కనకాల సుప్రసిద్ధ దర్శకుడు.. అంతేకాదు ఆయన యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్చుకున్న చాలా మంది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. ఇక భార్య సుమ అయితే టాప్ యాంకర్. ఆమె క్షణం తీరిక లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది.రాజివ్ కి ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు.కానీ స్నేహం పేరుతో వారిని అవకాశాలు అడగలేనని ఒక సంధర్బంలో చెప్పారు రాజీవ్..వారిని కలిసినప్పుడు సినిమా అవకాశాల గురించి కన్నా వారి స్నేహం గురించే ఎక్కువ మాట్లాడతానని చెప్పారు..

చిరంజీవితో కలిసి నటించడం కోసం వెయిట్ చేస్తున్న రాజివ్ చిరుతో తన జ్ణాపకాలనను,అదేవిధంగా బాలక్రిష్ణ,వెంకటేష్,నాగర్జునతో తన సినిమా అనుభవాలను చెప్పుకొచ్చారు.అది కూడా వారిని ఇమిటేట్ చేస్తూ…రాజీవ్ ఏం చెప్పాడో మీరే చూడండి..