నేనెందుకు క్షమాపణ చెప్పాలి?

1971లో సేలంలో నిర్వహించిన ఒక ర్యాలీలో నగ్నంగా ఉన్న సీతారాముల విగ్రహాలను పెరియార్‌ తీసుకు వెళ్లారని.అది ఆయన చెసిన తప్పు అంటూ రజినీకాంత్‌ వ్యాఖ్యలు చేశారు అంటూ తమిళ మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి.

 Rajinkanth Respond News Comes In Social Media About Me-TeluguStop.com

ఆ కథనాలపై తమిళనాడు జనాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.తమిళులు పెరియార్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తారు.

అలాంటి పెరియార్‌ను విమర్శించడంపై తమిళనాడు జనాలు జీర్ణించుకోలేక పోతున్నారు.రజినీకాంత్‌ తమ మనోభావాలను దెబ్బ తీశాడు అంటూ పలు పోలీసు స్టేషన్స్‌లో ఫిర్యాదు నమోదు అయ్యాయి.

వెంటనే రజినీకాంత్‌ క్షమాపణలు చెప్పాలిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

తనపై వస్తున్న ఆరోపణలపై రజినీకాంత్‌ స్పందించాడు.

తాను అలాంటి ఆరోపణలే చేయలేదు అని, తనను కొందరు కావాలని ఈ వివాదంలో ఇరికించే ప్రయత్నం చేశారు అంటూ రజినీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండానే మీడియాలో కథనాలు వచ్చాయి.

నేను ఎందుకు క్షమాపణలు చెప్పాలి.నేను చేయని తప్పుకు క్షమాపణలు చెప్పను అంటూ రజినీకాంత్‌ పేర్కొన్నాడు.

నాపై అసత్య ఆరోపణలు చేస్తూ నా పరువు తీస్తున్న వారిపై కేసు పెట్టబోతున్నట్లుగా కూడా రజినీకాంత్‌ పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube