నా అల్లుడు మంచోడు.. వైరల్ అవుతున్న రజనీకాంత్ వీడియో!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ధనుష్ తర్వాత రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు అల్లుడైన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ధనుష్ ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటన చేసి ప్రేక్షకులను షాకయ్యేలా చేశారు.

 Rajinikath Old Video Goes Viral In Social Media ,rajinikanth , Danush , Viral Ve-TeluguStop.com

విడాకుల ప్రకటన వల్ల ధనుష్ కెరీర్ పై కూడా ఎఫెక్ట్ పడుతోందని సమచారం.తమిళనాట ధనుష్ హీరోగా నటించి రిలీజ్ కాబోయే సినిమాలపై ఈ ప్రభావం పడనుందని బోగట్టా.

ధనుష్ కు సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా రజనీకాంత్ వల్ల ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగింది.రజనీకాంత్ అల్లుడు కాబట్టే ధనుష్ ప్రయోగాలు చేసినా ప్రశంసలు దక్కాయి.

ధనుష్ నటించిన ఆత్రంగి రే సినిమా త్వరలో విడుదల కానుంది.ఈ సినిమా ఫలితాన్ని బట్టి ధనుష్ సినిమాల విషయంలో రజనీకాంత్ అభిమానులు ఎలా వ్యవహరిస్తారో తెలిసే ఛాన్స్ ఉంది.

రజనీ, ధనుష్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది.

అయితే గతంలో ఒక సందర్భంలో రజనీకాంత్ ధనుష్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో రజనీకాంత్ ధనుష్ అద్భుతమైన అబ్బాయని తన తల్లిదండ్రులను ధనుష్ ఎంతగానో గౌరవిస్తాడని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులను ధనుష్ దేవుడిలా చూసుకుంటాడని భార్యను కూడా బాగా చూసుకుంటాడని రజనీకాంత్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ధనుష్ మంచి తండ్రి అని మంచి అల్లుడని మంచి మనిషని మంచి ప్రతిభ గలవాడు అని రజనీకాంత్ అన్నారు.రజనీకాంత్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.18 సంవత్సరాల పాటు ధనుష్ ఐశ్వర్య సంతోషంగా ఉన్నారు.అయితే ఎవరూ ఊహించని విధంగా తాజాగా వాళ్లిద్దరూ విడిపోవడం గమనార్హం.

ధనుష్ ఐశ్వర్య మళ్లీ కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube