టెలివిజన్ లో ఆల్ టైం రికార్డులు బ్రేక్ చేసిన రజినీకాంత్ వైల్డ్ షో  

Rajinikanths Into The Wild With Bear Grylls Creates History - Telugu Discovery Channel, Rajinikanth\\'s \\'into The Wild With Bear Grylls\\' Creates History, South India Cinema, Tollywood

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రజినీకాంత్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన అదికాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిపోతుంది.

 Rajinikanths Into The Wild With Bear Grylls Episode Creates History

ఇక అతని సినిమా రిలీజ్ అవుతుంది అంటే వారం రోజుల టికెట్స్ ముందే క్లోజ్ అయిపోతాయి.రజినీకాంత్ కి కేవలం సౌత్ లోనే కాకుండా ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అతన్ని అనుసరించే వారు కోట్లలో ఉన్నారు.అలాంటి రజినీకాంత్ కి సంబందించిన వీడియో డిజిటల్ మీడియాలో వస్తుంది అంటే చూడకుండా ఉంటారా.

చూడటంతో పాటు రికార్డులు కూడా క్రియేట్ చేస్తారు.ఇప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే షో డిస్కవరీ చానల్ లో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఇందులో బేర్ గ్రిల్స్ చేసే సాహసాలు చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు.

బేర్ గ్రిల్స్ హోస్ట్ చేసే ఈ షోలో ఇప్ప‌టికే చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సైతం బేర్ గ్రిల్స్‌తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించిన డిస్కవరీ ఛానల్ లో ప్రసారం చేశారు.దీనికి మంచి వ్యూస్ వచ్చాయి.

బేర్ తో మోడీ కలిసి ప్లాన్ చేసిన ఎపిసోడ్ ప్రీమియర్స్ కు గాను ఒక కోటి 20న లక్షలకు పైగా వ్యూవర్ షిప్ వచ్చింది.ఇప్పుడు కర్నాటకలో బందీపూర్‌ నేషనల్‌ పార్కులో మూడు రోజుల పాటు బేర్ గ్రిల్స్‌ తో కలిసి రజినీకాంత్ చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ మొదటి ఎపిసోడ్ భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ ప్రీమియర్స్ కు మూడు కోట్ల ముప్పై లక్షలకు పైగా వ్యూవర్ షిప్ వచ్చింది.ప్రపంచంలోనే ఏ షోకు కూడా రాని వ్యూవర్ షిప్ ఇదని డిస్కవరీ ఛానెల్ వారే వెల్ల‌డించారు.

మొత్తానికి ఈ షోకి వచ్చిన వ్యూవర్ షిప్ తో రజినీకాంత్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అనేది అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanths Into The Wild With Bear Grylls Episode Creates History Related Telugu News,Photos/Pics,Images..