సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం... త్వరలో...- Rajinikanth Will Take Retirement From Acting

Rajinikanth Will Take Retirement From Acting, Tollywood, Kollywood, South India Super Star, Rajinikanth , Political Entry, Rajinikanth Health Condition - Telugu Acting, Kollywood, Political Entry, Rajinikanth, Rajinikanth Health Condition, Rajinikanth Will Take Retirement From Acting, South India Super Star, Tollywood

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అని చెప్పాలి.తన స్టైల్, మేనరిజమ్స్ తో ఎన్నో కమర్షియల్ హిట్స్ సొంతం చేసుకున్న రజినీకాంత్ ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ స్టార్స్ లలో టాప్ 5లో ఉంటాడని చెప్పాలి.

 Rajinikanth Will Take Retirement From Acting-TeluguStop.com

అతనితో సినిమా చేయాలంటే నిర్మతలు కచ్చితంగా ఒక 150 కోట్లు బడ్జెట్ రెడీ చేసుకోవాలి.అలాగే అతని సినిమాకి ఓపెనింగ్స్ ద్వారానే వందకోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చేస్తాయి.

రజినీకాంత్ ఫ్లాప్ సినిమాకి కూడా వంద కోట్ల కలెక్షన్ గ్యారెంటీ అంటే అతనికున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.ప్రస్తుతం సూపర్ స్టార్ శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు.

 Rajinikanth Will Take Retirement From Acting-సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం… త్వరలో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ మధ్య రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ పార్టీపెట్టాలని రజినీకాంత్ భావించాడు.

అయితే ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యుల ఉత్తిడి మేరకు రాజకీయాలని దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.ఈ విషయాన్ని అభిమానులకి తెలియజేసి అందరికి సారీ చెప్పేశారు.రాజకీయంగా రజినీకాంత్ తో ప్రయాణం చేద్దామని అనుకున్న అందరూ ఇప్పుడు ఇతర పార్టీలలో రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు రజినీకాంత్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

త్వరలో సినిమాలని నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి రజిని వచ్చినట్లు కోలీవుడ్ లో వినిపిస్తుంది.అతని ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా షూటింగ్ ల కోసం ఇతర ప్రదేశాలలో తిరగడం తగ్గించుకోవాలని డాక్టర్లు సూచించడంతో కూతుళ్లు తండ్రిని నటనకి దూరం కావాలని సూచించారని తెలుస్తుంది.

ప్రస్తుతం బయట ప్రపంచం కరోనాతో సహజీవనం చేస్తుంది.ఈ నేపధ్యంలో వీలైనంత వరకు షూటింగ్ లకి దూరంగా ఉండటం బెటర్ అని నిర్ణయించుకొని సినిమాలకి స్వస్తి చెప్పాలని రజిని భావిస్తున్నట్లు టాక్.

అతను అన్నాత్తై సినిమా పూర్తి చేసి ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

#Kollywood #SouthIndia #RajinikanthWill #Acting #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు