కమల్‌ తర్వాత రజినీ కూడా... టెన్షన్‌లో తమిళ ఫ్యాన్స్‌  

Rajinikanth To Say Good Bye To Films-kamal Haasan,rajini Political Entry,rajinikanth,రజినీకాంత్‌,సూపర్‌ స్టార్స్‌

కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని భావించాడు. అయితే పార్లమెంటు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న భారతీయుడు 2 చిత్రాన్ని ఆపేయాల్సి వచ్చింది. దాంతో సినిమాలు మరియు రాజకీయాలు ఒకే సారి చేయడం తన వల్ల కావడం లేదని, అభిమానులు క్షమించండి, త్వరలోనే సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు..

కమల్‌ తర్వాత రజినీ కూడా... టెన్షన్‌లో తమిళ ఫ్యాన్స్‌-Rajinikanth To Say Good Bye To Films

కమల్‌ హాసన్‌ ప్రస్తుతం చేస్తున్న భారతీయుడు 2 చిత్రం తర్వాత మళ్లీ సినిమాలు చేయకపోవచ్చు అంటూ అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే రజినీకాంత్‌ కూడా సినిమాలకు గుడ్‌ బై చెప్పే టైం వచ్చిందని భావిస్తున్నాడట. త్వరలో చేయబోతున్న దర్బార్‌ చిత్రం తర్వాత కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత మరో సినిమా అంటే మొత్తంగా మూడు సినిమాలు చేసి సినిమాలకు శాస్వతంగా గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఒకేసారి ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ తమిళ సినీ పరిశ్రమకు గుడ్‌ బై చెప్పబోతున్న నేపథ్యంలో చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు మరియు పలువురు ప్రేక్షకులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా ఉండే వీరిద్దరు సినిమాలను వదిలితే తమిళ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటీ అంటూ ఇప్పటి నుండే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి వీరిద్దరి సినిమాలకు గుడ్‌ బై విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.