కమల్ హాసన్ కు రజిని సర్ ప్రైజ్ ఫోన్ కాల్..!

విలక్షణ నటుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ మధ్య తన ఆఫీస్ మెట్ల మీద నుండి కాలు జారి కింద పడ్డ విషయం తెలిసిందే.చిన్నపాటి సర్జరీ చేయించుకున్న కమల్ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు.

 Rajini Surprise Phone Call To Kamal Haasan-TeluguStop.com

శభాష్ నాయుడు షూటింగ్లో ఈ గాయమవడం జరిగింది.కమల్ ఆరోగ్య విషయాల గురించి సూపర్ స్టార్ రజినికాంత్ ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారట.

కబాలి షూటింగ్ ముగించుకున్నా అది రిలీజ్ అయ్యే దాకా ఫారిన్ లోనే ఉండి వచ్చిన రజిని చెన్నై చేరుకున్నారు.ఇక కమల్ విషయం గురించి తెలుసుకున్న రజిని తన ఆఫీస్ నుండి ఫోన్ చేసి మాట్లాడటం జరిగిందట.

రజిని సర్ ప్రైజ్ ఫోన్ కాల్ తో కమల్ కూడా సంతోషించారట.కాలి గాయం తగ్గుముఖం పట్టినా మరో నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కమల్ తో డాక్టర్లు సూచించారట.ఇక రజిని కూడా శంకర్ రోబో 2.0 కోసం సిద్ధమవుతున్నాడు.ఇక ఇద్దరు సూపర్ స్టార్స్ ఫోన్ చేసుకున్నారన్న విషయం తెలిసిన ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube