రాజకీయాల్లోకి రానన్న రజినీ ఆ స్టార్‌కు మద్దతిస్తే బాగుంటుంది

తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా రజినీకాంత్‌ నిలుస్తాడని అంతా భావించారు.కాని ఆయన మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.

 Rajinikanth Should Support To Kamal Haasan , Rajinikanth, Kamal Haasan, Tamil Na-TeluguStop.com

అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రాలేక పోతున్నాను.రాజకీయాల్లోకి రావాలనుకున్న నాకు దేవుడు అనారోగ్యం రూపంలో ఏదో మెసేజ్‌ ఇచ్చాడేమో అనిపిస్తుంది అంటూ రజినీకాంత్‌ వింత వ్యాఖ్యలు చేసి చివరకు రాజకీయాల్లోకి రావడం లేదు క్షమించండి అంటూ ఒక లేఖను రాశాడు.

ఆ లేఖలో తాను రాజకీయాల్లోకి రాకుండానే ప్రజా సేవ చేస్తానంటూ పేర్కొన్నాడు.ఇప్పటికి రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రాకున్నా ఆయన ఏదైనా పార్టీకి మద్దతుగా నిలిచి వారిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తే చాలా మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు అదే చర్చ తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telugu Kamal Haasan, Kamal Hassan, Kamal, Rajini Kanth, Rajini, Rajinikanth, Tam

రజినీకాంత్‌ ఎలాగూ రాజకీయాల్లోకి రాలేదు.కనుక ఆయన కమల్ హాసన్‌ కు మద్దతుగా నిలిస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే బాగుండేది.

కాని ఆయన రాలేదు.సరే ఆయన ఏదో ప్రయత్నిస్తాను బాగు చేస్తాను అంటూ చెబుతున్న కమల్‌ హాసన్‌ కు మద్దతు ఇస్తే బాగుంటుంది కదా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కమల్‌ హాసన్‌ రాజకీయాల్లో ప్రత్యేకంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఆయన ప్రత్యేకంగా ఏదైనా సాధించాలంటే గెలవాల్సిన అవసరం ఉంది.

రజినీకాంత్‌ ఇప్పుడు ఆయనకు మద్దతు ఇస్తే రాజకీయాల్లో ఏదో ఒక అద్బుతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అందుకే రజినీకాంత్‌ వచ్చే ఎన్నికల్లో తన అభిమానులకు కమల్‌ కు ఓట్లు వేయండి అంటూ పిలుపునివ్వాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

మరి రజినీకాంత్‌ ఆంతర్యం ఏంటీ.ఏ పార్టీకి ఆయన మద్దతు ఉంటుందనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube