చిన్నల్లుడిని కూడా సెట్‌ చేయాలని ప్రయత్నిస్తున్న రజినీకాంత్‌.. వర్కౌట్‌ అయ్యేనా?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసే పనిలో ఉన్నాడు.తమిళనాడులో అసెంబ్లీకి మద్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రజినీకాంత్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాడు.

 Rajinikanth Second Son In Law Into Movies-TeluguStop.com

అప్పటి వరకు వరుసగా చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇదే సమయంలో రజినీకాంత్‌ తన చిన్న అల్లుడు, కొత్త అల్లుడు అయిన విశాగన్‌ను కూడా సెటిల్‌ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు

ఇప్పటికే పెద్ద అల్లుడు ధనుష్‌ తమిళనాటు ఏలేస్తున్నాడు.

దనుష్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడిన విషయం తెల్సిందే.భారీ ఎత్తున ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ధనుష్‌ కూడా ఒకడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు చిన్న కూతురు రెండవ వివాహం చేసుకున్న నేపథ్యంలో చిన్న అల్లుడిని కూడా హీరోగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.వ్యాపారవేత్త అయిన విశాగన్‌ గతంలో ఒక చిత్రంలో నటించాడు.

నటుడు అవ్వాలనే ఆశతో ఆ సినిమాను చేసిన విశాగన్‌ నిరాశ పొందాడు.ఆ సినిమా సక్సెస్‌ అవ్వలేదు.

దాంతో ఇప్పుడు మామ సాయంతో మరోసారి ప్రయత్నాలు చేయబోతున్నాడు

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కార్తిక్‌ సుబ్బరాజుకు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్వయంగా తన అల్లుడికి ఒక కథను తయారు చేయమని చెప్పాడట.ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రంను ధనుష్‌ లేదా మరే నిర్మాత అయినా నిర్మించే అవకాశం ఉంది.విశాగన్‌ను స్టార్‌ చేయాలనే పట్టుదలతో రజినీకాంత్‌ ఉనానడు.

మరి మామ క్రేజ్‌తో విశాగన్‌ స్టార్‌డం దక్కించుకుంటాడా, అసలు ఇది వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube